గగనతల రారాజు ‘జిర్కాన్‌’.. ఎన్నో ప్రత్యేకతలు

Published on Thu, 02/15/2024 - 08:51

రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరేలాగా తాజా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రష్యా అత్యాధునిక అస్త్రాన్ని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఈ విషయాన్ని మాస్కో బహిర్గతం చేయకపోయినా కీవ్‌ ఫోరెన్సిక్‌ పరిశోధనా సంస్థ బృందం గుర్తించింది. ఇటీవల కీవ్‌పై జరిగిన ఒక దాడిలో రష్యా జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని వాడినట్లు ఆ బృందం వెల్లడించింది.

జిర్కాన్‌ ప్రత్యేకతలు..

  • ఒక్కసారి జిర్కాన్‌ క్షిపణి గాల్లోకి ఎగరడం మొదలుపెడితే దాన్ని ప్రపంచంలోని ఏ అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేదు.
  • అమెరికాకు చెందిన మిసైల్‌ డిఫెన్స్‌ అడ్వొకసి అలయన్స్‌ అంచనా ప్రకారం ఈ క్షిపణి గంటకు 9,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
  • ఒకవేళ ఇలా వస్తున్న వార్తలు నిజమైతే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి జిర్కాన్‌.
  • దాన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. 

  • ఈ క్షిపణి ప్రయాణించే సమయంలో దాని చుట్టూ ప్లాస్మా మేఘంతో వలయం ఏర్పడుతుంది.
  • గగనతల రక్షణ వ్యవస్థల నుంచి వచ్చే రాడార్‌ సంకేతాలను అది తనలో కలిపేసుకుంటుంది.
  • దీంతో ఈ క్షిపణిని గుర్తించడానికి వీలుండదు.
  • అమెరికాకు చెందిన ‘ఏజిస్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు శత్రు అస్త్రాలను నేలకూల్చడానికి 8-10 సెకన్ల సమయం అవసరం.
  • ఇంత స్వల్ప వ్యవధిలో జిర్కాన్‌ 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందువల్ల ఏజిస్‌ క్షిపణికి కూడా అది అందదని రష్యా నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే..

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)