Breaking News

గ్రామీణ మార్కెట్‌పై ఎఫ్‌ఎంసీజీ ఆశలు

Published on Tue, 07/30/2024 - 06:05

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంసీజీ విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటాయని కాంటార్‌ వరల్డ్‌ ప్యానెల్‌ నివేదిక అంచనా వేసింది. అమ్మకాల్లో 6.1 శాతం వృద్ధి ఉండొచ్చని తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు 4.4 శాతం పెరిగినట్టు వెల్లడించింది. 

ఇక పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల విక్రయాలు ఫ్లాట్‌గా 4.2 శాతం మేర వృద్ధిని నమోదు చేయవచ్చంటూ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 

గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారి స్థిరత్వం నెలకొంటే అక్కడి నుంచి భారీ మార్పు కనిపించొచ్చని అభిప్రాయపడింది. పట్టణాలతో సమానంగా సమీప భవిష్యత్తులో పల్లెల్లోనూ అమ్మకాలు ఊపందుకోవచ్చని తెలిపింది. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమకు సగం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నట్టు గుర్తు చేసింది. ఎఫ్‌ఎంసీజీలో వృద్ధి జనాభా ఆధారంగానే ఉంటుంది కానీ, వినియోగం ఆధారంగా కాదని వివరించింది.  

ఇవీ సమస్యలు.. 
ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, గ్రామీణ గృహ పరిమాణంలో తగ్గుదల, యుటిలిటీల కోసం (టెలిఫోన్, విద్యుత్, పెట్రోల్‌ తదితర) ఎక్కువగా ఖర్చు చేస్తుండడం, పొదుపుపై ఎక్కువగా దృష్టి పెట్టడం గ్రామీణ ప్రాతాల్లో ఎఫ్‌ఎంసీజీ వినియోగంలో స్తబ్దతకు కారణాలుగా కాంటార్‌ నివేదిక పేర్కొంది. కరోనా విపత్తు తర్వాత నుంచి గ్రామీణ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ వినియోగం పడిపోవడం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలోనే ఇది పుంజుకుంది.  

ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ 
ఇతర రంగాల మాదిరే ఎఫ్‌ఎంసీజీలోనూ ప్రీమియమైజేషన్‌ (నాణ్యమైన, ఖరీదైన బ్రాండ్ల వైపు మొగ్గు) ధోరణి వృద్ధి చెందుతోందని కాంటార్‌ నివేదిక తెలిపింది. ఇది మెరుగైన జీవన ప్రమాణాలను తెలియజేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని విభాగాలు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని ఇస్తున్నట్టు, దీంతో ప్రీమియం ఉత్పత్తులకు ఎక్కువ చెల్లించేందుకు ముందుకు వస్తున్నట్టు తెలిపింది. ఆహారం, ఫేస్‌ స్క్రబ్‌/పీల్‌/మాస్‌్క, బాడీ వాష్, హెయిర్‌ కండీషనింగ్‌ సిరమ్, ముసేలి, కొరియన్‌ నూడుల్స్‌ను ఉదాహరణలుగా పేర్కొంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)