Breaking News

రూపాయి బలహీనపడినా.. ఎగుమతిదారులకు లాభాలు అంతంతే..!

Published on Tue, 01/14/2025 - 04:33

న్యూఢిల్లీ: ఒక దేశం కరెన్సీ బలహీనపడితే, ఆ దేశం ఎగుమతిదారులకు లాభాలు భారీగా వచ్చిపడతాయన్నది ఆర్థిక  సిద్దాంతం. అయితే భారత్‌ ఎగుమతిదారుల విషయంలో ఇది పూర్తి స్థాయిలో వాస్తవ రూపం దాల్చడం లేదు. రూపాయి బలహీనపడినా.. వారికి వస్తున్న లాభాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. 

వారు చేస్తున్న విశ్లేషణల ప్రకారం ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల తయారీ.. ముడి వస్తువుల దిగుమతులపై ఆధారపడుతుండడం.. ఈ నేపథ్యంలో దిగుమతుల బిల్లు తడిసి మోపెడవుతుండడం దీనికి ఒక కారణం.  దీనికితోడు  ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి దేశీయ ఎగుమతిదారులకు పరిమిత ప్రయోజనాలను అందిస్తోంది. గత ఏడాది జనవరి నుంచి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 4 శాతానికిపైగా పతనమైంది. గత ఏడాది జనవరి 1వ తేదీన రూపాయి విలువ 83.19 పైసలు అయితే 2025 జనవరి 13వ తేదీన ఒకేరోజు భారీగా 66 పైసలు పడిపోయి 86.70కి చేరింది.  

అన్ని రకాలుగా ఇబ్బందే... 
రూపాయి దిగువముఖ ధోరణులు ఎగుమతిదారులకు లాభాలు పంచలేకపోతున్నాయి. రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతయ్యే ముడి పదార్థాలు, విడిభాగాలు, ఇతర ఉత్పత్తుల ధరలు డాలర్లలో పెరుగుతాయి. ఈ వ్యయాల పెరుగుదల బలహీనమైన రూపాయి నుండి పొందిన పోటీ ప్రయోజనాన్ని దెబ్బతీస్తోంది. ఫార్మా, రత్నాలు–ఆభరణాల వంటి రంగాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇంకా షిప్పింగ్, బీమా, మార్కెటింగ్‌ వంటి ఖర్చులు కూడా డాలర్‌–డినామినేట్‌ అవుతాయి. 

ఇది కూడా క్షీణించిన రూపాయి ప్రయోజనాలు ఎగుమతిదారుకు దక్కకుండా చేస్తోంది. ఇక డాలర్‌ మారకంలో చైనీస్‌ యువాన్, జపనీస్‌ యెన్, మెక్సికన్‌ పెసో వంటి ఇతర పోటీ దేశాల కరెన్సీలు కూడా భారత రూపాయితో పోలిస్తే మరింత క్షీణించాయి. ఎగుమతిదారులకు ఇదీ ఒక ప్రతికూల అంశమే.  చాలా మంది ఎగుమతిదారులు కరెన్సీ హెచ్చుతగ్గుల సమస్యను ఎదుర్కొనడానికి హెడ్జింగ్‌ కవర్‌ తీసుకుంటారు. ఎందుకంటే వారి ఇన్‌పుట్‌ ఖర్చు పెరుగుతుంది. రూపాయి బలహీనత వల్ల వారికి తగిన ప్రయోజనం లభించడం లేదు.          
 – సంజయ్‌ బుధియా, సీఐఐ (ఎగ్జిమ్‌) నేషనల్‌ కమిటీ  చైర్మన్‌

అనిశ్చితిని భరించలేం.. 
రూపాయి విలువ పడిపోతోందా? పెరుగుతోందా? అన్నది ఇక్కడ సమస్య కాదు. బాధ కలిగిస్తున్న అంశం రూపాయి విలువలో అస్థిరత. కరెన్సీలో స్థిరత్వం ఉండాలి. అస్థిరత ఉంటే అనిశ్చితిని ఎలా నిర్వహించాలో ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్య.    – ఎస్‌ సి రాల్హాన్,  ఇంజనీరింగ్‌ 
ఉత్పత్తుల ఎగుమతిదారు (లూథియానా) 
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)