Breaking News

34 లక్షల మందికి ఇంటి రుణాలు

Published on Sat, 05/13/2023 - 04:51

న్యూఢిల్లీ: బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు 2022లో దేశవ్యాప్తంగా 34 లక్షల మందికి ఇంటి రుణాలను మంజూరు చేశాయి. వీటి విలువ రూ.9 లక్షల కోట్లు. రిటైల్‌ రుణాలపై ఈక్విఫ్యాక్స్, ఆండ్రోమీడియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రూ.25 లక్షల లోపు ఇంటి లోన్‌ అందుకున్నవారి సంఖ్య గతేడాది ఏకంగా 67 శాతం ఉండడం గమనార్హం. రూ.75 లక్షలు–రూ.1 కోటి వరకు తీసుకున్న లోన్లు 36 శాతం అధికం అయ్యాయి. 2021తో పోలిస్తే హోమ్‌ లోన్స్‌ 2022లో 18 శాతం ఎగశాయి.

అలాగే ఈ రుణాలు అందుకున్నవారి సంఖ్య 17 శాతం పెరిగింది. 2021 డిసెంబర్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు మొత్తం గృహ రుణాలు 16 శాతం అధికం అయ్యాయి. వ్యక్తిగత రుణాల్లో 57 శాతం వృద్ధి నమోదైంది. రిటైల్‌ రుణ మార్కెట్‌ విలువ 2022 డిసెంబర్‌ నాటికి రూ.100 లక్షల కోట్లకు చేరింది. 54 కోట్ల యాక్టివ్‌ లోన్లు ఉన్నాయి. గతేడాది చివరినాటికి గృహోపకరణాల కోసం రుణాలు అందుకున్న యాక్టివ్‌ కస్టమర్ల సంఖ్య 6.5 కోట్లు.

2021తో పోలిస్తే ఇది 48 శాతం అధికం. హోమ్‌ లోన్స్‌ విభాగంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఆరోగ్యకర వృద్ధిని నమోదు చేశాయి. వినియోగం పెరగడం, సులువుగా లభ్యత, రుణదాతల మధ్య పోటీ వ్యక్తిగత రుణ విభాగం డిమాండ్‌కు కారణం. ఇటీవల ఆర్‌బీఐ పాలసీ రేటు పెంపుదల ఉన్నప్పటికీ గృహ రుణ రేట్ల మాదిరిగా వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు పెరుగుదలను చూడలేదు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)