Breaking News

రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం..

Published on Sat, 10/28/2023 - 21:02

తక్కువ ధరలో కారు కొనాలన్నా.. కనీసం ఐదు లక్షలైనా ఉండాలి. లగ్జరీ కార్ల విషయానికి వస్తే కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం రూ. 100 పెడితే లక్షల ఖరీదైన కారు గెలుచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అస్సాంలో ప్రతి ఏటా నిర్వహించే హౌలీ రాస్ ఫెస్టివల్‌ (Howly Raas Festival) ముందు నిర్వాహక కమిటీ గత సంవత్సరం మాదిరిగానే లాటరీని నిర్వహించింది. ఇందులో మొదటి బహుమతి రూ.76 లక్షల విలువైన రేంజ్ రోవర్. రెండవ బహుమతి రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, స్కార్పియో, మూడవ బహుమతి స్కోడా కుషాక్, నెక్సాన్ ఉన్నాయి.

ఈ ఖరీదైన కార్లను సొంతం చేసుకోవాలంటే కేవలం రూ.100 పెట్టి లాటరీ టికెట్ కొంటే సరిపోతుంది. ఈ లాటరీ అనేది గత 95 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు, విజేతలకు కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాటరీ విషయం తెలిసి చాలామంది టికెట్ కొనటానికి బారులు తీరుతున్నారు.

ఇదీ చదవండి: వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్..

లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత విజేతలను 2023 డిసెంబర్ 10న ప్రకటించనున్నారు. లాటరీ టికెట్స్ అమ్మిన డబ్బును వివిధ కార్యక్రమాలను ఉపయోగిస్తారు. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్‌ పండుగను నిర్వహిస్తారు. గతేడాది మొత్తం 3.2 లక్షల లాటరీ టికెట్స్ అమ్ముడయ్యాయి, ఈ సారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)