Breaking News

రూ.500 కోట్ల ఖరీదైన వినాయకుడు.. ఎక్కడుందో తెలుసా?

Published on Thu, 09/21/2023 - 12:46

Most Expensive Ganesha Idol: వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చాలామంది ప్రజలు తమ స్తోమతను బట్టి విగ్రహాలను కొనుగోలు చేసి ఆరాధిస్తూ ఉంటాడు. అయితే సూరత్ వ్యాపారవేత్త వద్ద ఉన్న గణేష్ ప్రతిమ మాత్రం చాలా ప్రత్యేకం, అంతే కాకుండా ఇది చాలా ఖరీదైనది కూడా. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిజానికి ఇది ఒక వజ్రం ముక్క. వినాయకుడిని పోలి ఉండటం వల్ల ప్రతి ఏటా దీనికి పూజలు చేసి, నిమజ్జం కార్యక్రమంలో భాగంగా తాపీ నది జలాలను విగ్రహం మీద చల్లుతారు. దీనిని 2005వ సంవత్సరంలో రూ. 29,000లతో కాంగోలోని మ్బుజీ గని నుంచి వేలంలో భాగంగా రాజేష్ పాండవ్ అనే వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసాడు.

ఈ వజ్రం ఇండియాకు తీసుకువచ్చిన తరువాత వినాయకుని రూపంలో ఉండటం గమనించి దానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ విగ్రహం పొడవు 24.11 మిమీ, వెడల్పు 16.49 మిమీ వరకు మాత్రమే ఉంది. ఇది 27.74 క్యారెట్స్ డైమండ్. దీనిని 2016లో  వజ్రాల పరిశ్రమకు సంబంధించిన వార్షిక ప్రదర్శనలో కూడా ప్రదర్శించాడు. అప్పటి నుంచి దీనికి విస్తృత ప్రచారం లభించింది.

ఇదీ చదవండి: ఏటా వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే..

ఈ ప్రతిమను కొనుగోలు చేయడానికి చాలామంది ముందుకు వచ్చారని. అయితే దానిని విక్రయించే ఆలోచన తనకు లేదని వజ్రాల వ్యాపారి స్పష్టం చేసాడు. సంవత్సరటం మొత్తం దానిని జాగ్రత్తగా ఉంచి, పండుగ సమయంలో మాత్రమే బయటకు తీస్తామని తెలిపాడు. దీని విలువ ఇప్పుడు సుమారు రూ. 500 కోట్లు వరకు ఉంటుందని అంచనా.

Videos

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు