Breaking News

రూ.21000 కోట్లు: మూడేళ్ళలో యూట్యూబర్ల సంపాదన..

Published on Fri, 05/02/2025 - 14:51

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా సంపాదించడానికి మార్గాలను వెతుకుతున్నారు. పెట్టుబడి లేకుండా సంపాదించడానికి యూట్యూబ్ ఓ మంచి ఫ్లాట్‌ఫామ్. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభిస్తున్నారు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా గత మూడేళ్ళలో కంటెంట్ క్రియేటర్లు ఎంత సంపాదించారనే విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ వెల్లడించారు.

గత మూడు సంవత్సరాలలో యూట్యూబ్.. భారతీయ క్రియేటర్లకు, మీడియా సంస్థలు మొదలైన వాటికి రూ. 21,000 కోట్లకు పైగా చెల్లించింది. ఈ విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ ముంబైలో జరిగిన ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES)లో స్పష్టం చేశారు. అంతే కాకుండా.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి రాబోయే రెండు సంవత్సరాలలో.. రూ.850 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడి ప్రత్యేకంగా భారతదేశ కంటెంట్ క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: 1925లో బంగారం రేటు ఇంత తక్కువా?: అదే ధర ఇప్పుడుంటే..

భారతదేశంలోని సుమారు 100 మిలియన్ల కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేదా యూట్యూబర్లు కంటెంట్ అప్లోడ్ చేశారు. సుమారు 15,000 మంది యూట్యూబర్లు ఒక ఏడాదిలోనే 10 లక్షల సబ్‌స్క్రైబర్‌లను పొందిన రికార్డును సొంతం చేసుకున్నారు. కాగా 2005 ఫిబ్రవరి 14న ప్రారంభమైన యూట్యూబ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు