Breaking News

రోల్స్‌ రాయిస్‌.. 2,500 మందికి లేఆఫ్స్‌

Published on Wed, 03/26/2025 - 11:38

ప్రముఖ బ్రిటిష్‌ లగ్జరీ కారు, ఏరో ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ గడిచిన ఏడాది కాలంలో 2,500 మందికి లేఆఫ్స్‌ ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది మేనేజర్‌ స్థాయి ఉద్యోగులేనని ఫార్చ్యూన్ రిపోర్ట్‌ తెలిపింది. కంపెనీ సీఈఓగా టుఫాన్ ఎర్గిన్‌బిలిక్‌ బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలో విభిన్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో భాగంగా కొందరు ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించడంతోపాటు సంస్థ షేరు ధర 500 శాతం ఎగబాకి రికార్డు నెలకొల్పింది.

రోల్స్‌ రాయిస్‌ సీఈఓగా టుఫాన్ ఎర్గిన్‌బిలిక్‌ 2023 చివర్లో బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో  నిర్దిష్ట గడువులోపు కంపెనీ ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించున్నారు. సంస్థ రెవెన్యూ పెంచడంలో భాగంగా 2,500 మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ‍ప్రకటించారు. దాంతోపాటు కొన్ని విధానపరమైన నిర్ణయాలతో సంస్థ ఆదాయాన్ని ముందుగా నిర్ణయించుకున్న గడువులోపే మార్కెట్ విలువకు 70 బిలియన్ డాలర్లకు పైగా జోడించారు. ఇది పెట్టుబడిదారులను ఆకర్షించి స్టాక్‌ ధర ఏకంగా ఏడాదిలో 500 శాతం ఎగబాకేలా చేసింది.

ఇదీ చదవండి: భారత ఆర్థిక వ్యవస్థ భేష్‌

ఈమేరకు ఎర్గిన్‌బిలిక్ ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘రోల్స్ రాయిస్ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉద్యోగులకు స్పష్టంగా తెలియజేశాం. దాంతో కంపెనీలో 42,000 మంది ఉద్యోగులు అప్రమత్తం అయ్యారు. ఇది పనిపై మరింత ఫోకస్‌ పెట్టేందుకు కారణమైంది. కరోనా సమయంలో విమాన ప్రయాణాలు తగ్గడంతో కంపెనీ కాంట్రాక్టులు తగ్గిపోయాయి. తిరిగి మార్కెట్‌లో క్రమంగా పుంజుకున్నాం. రోల్స్ రాయిస్ ఒక బర్నింగ్ ప్లాట్‌ఫామ్‌. ఉద్యోగుల మెరుగైన ఆలోచనలను అమలు చేసేందుకు 500 మందికి ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లను నిర్వహించాం’ అని తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)