Breaking News

రోబో ఆత్మహత్య! కారణం అదేనా..

Published on Fri, 07/05/2024 - 21:30

పని ఒత్తిడి ఎక్కువైతే డిఫ్రెషన్‌లోకి వెళ్లడం.. ఆత్మహత్య చేసుకోవడం వంటివి మనుషులే చేస్తారు. అయితే రోబోట్స్ కూడా ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటాయని ఇటీవలే ఓ సంఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది. రోబోట్ ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అని చాలామందికి అనుమానం రావొచ్చు? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే..

సౌత్ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్‌లో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్‌గా పనిచేస్తున్న రోబోట్.. ఇటీవల 'రోబో సూపర్‌వైజర్'గా పిలువబడే రోబోట్ కౌన్సిల్ భవనంలోని మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఉండే మెట్ల మీద నుంచి కిందపడిపోయింది. దీనిని మొట్టమొదటి "రోబోట్ ఆత్మహత్య"గా చెబుతున్నారు.

సిటీ కౌన్సిల్ అధికారులు వెంటనే స్పందించారు. పగిలిన రోబోట్ ముక్కలను విశ్లేషణ కోసం సేకరించారు. ఇది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోబోట్ ఎక్కువ పని చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చాలా మంది అనుకుంటున్నారు.

రోబోట్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విచిత్రంగా ప్రవర్తించినట్లు, అక్కడే ఏదో వెతుకుతున్నతలు అటూ, ఇటూ తిరుగుతూ కనిపించిందని అక్కడ పనిచేసే ఉద్యోగులు పేర్కొన్నట్లు సమాచారం. ప్రతి రోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు రోబోట్ పనిచేస్తుంది. ఇలా విరామం లేకుండా పనిచేయడం వల్లనే రోబోట్ ఆలా ప్రవర్తించిందని, ఆత్మహత్య చేసుకుందని పలువురు భావిస్తున్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే.. సౌత్ కొరియాలో రోబోట్స్ వినియోగం చాలా ఎక్కువ. ప్రతి పది మంది ఉద్యోగులకు సహాయం చేయడానికి ఒక రోబోట్ ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ వెల్లడించింది. కాగా రోబోట్ నిజంగా ఆత్మహత్య చేసుకుందా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)