Breaking News

లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌

Published on Sat, 02/28/2026 - 08:43

సాక్షి, సిటీబ్యూరో:  లగ్జరీ గృహాలకు ఇండియన్‌ మార్కెట్లో ఏనాడూ డిమాండ్‌ తగ్గలేదు. ఏటా లగ్జరీ హౌసింగ్‌ గణనీయంగా విస్తరిస్తోంది. డెవలపర్లు పెద్ద లేఅవుట్లు, ప్రీమియం వసతులు, ఇంటిగ్రేటెడ్‌ లైఫ్‌స్టైల్‌ సౌకర్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో వీటి సరఫరా పెరుగుతోంది. ప్రస్తుతం మొత్తం ఇళ్ల సప్లయిలో లగ్జరీ యూనిట్ల వాటా 27 శాతంగా ఉంది. 2021లో ఈ విభాగం వాటా 16 శాతంగా ఉండేది. అద్భుతమైన డిజైన్, సౌలభ్యం, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లు పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు కాస్త ఊపందుకున్నాయి.

విస్తరిస్తున్న మార్కెట్‌
భారత లగ్జరీ మార్కెట్‌ గతేడాది 17 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2030 నాటికి మరింత పెరుగుతుందని మ్యాజిక్‌ బ్రిక్స్‌ అంచనా వేసింది. ప్రీమియం వ్యయాలకు కస్టమర్లు ఏమాత్రం వెనుకడుగు వేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. భారత లగ్జరీ హౌసింగ్‌ మార్కెట్‌ పరిపక్వ దశకు చేరుకుందని, సంప్రదాయ మెట్రో కేంద్రాల నుంచి కొత్త భౌగోళిక ప్రాంతాలు, శివార్లకు లగ్జరీ గృహ మార్కెట్‌ విస్తరిస్తోందని పేర్కొంది.  

టౌన్‌షిప్‌ల అభివృద్ధితో.. 
ప్రధాన నగరాల్లో లగ్జరీ ప్రైజ్‌ ఇండెక్స్‌ (ఎల్‌పీఐ) 2021లో 2.32గా ఉండగా.. 2025 నాటికి 2.27కి తగ్గింది. ఇదే కాలంలో కొత్త ప్రాంతాలు, శివార్లలో ఎల్‌పీఐ 1.00 నుంచి 1.44కి పెరగడమే దీనికి సూచన అని వివరించింది. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, పెద్ద ఎత్తున టౌన్‌íÙప్‌ల అభివృద్ధితో శివార్లలో లగ్జరీ గృహాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. మధ్యస్థ లగ్జరీ గృహాల ధరలు ముంబైలో అత్యధికంగా రూ.9.66 కోట్లుగా ఉండగా.. గూర్గావ్‌లో రూ.5.46 కోట్లు, బెంగళూరులో రూ.2.91 కోట్లు, హైదరాబాద్‌లో రూ.2.20 కోట్లు, చెన్నైలో రూ.2 కోట్లు, పుణెలో రూ.1.97 కోట్లు, కోల్‌కతాలో రూ.1.50 కోట్లుగా ఉన్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)