Breaking News

రిలయన్స్‌ డీలా

Published on Sat, 07/20/2024 - 06:04

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 15,138 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్‌ బిజినెస్‌ల వృద్ధిని ఇంధన, పెట్రోకెమికల్‌ మార్జిన్లు దెబ్బతీశాయి.  గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 16,011 కోట్లు ఆర్జించింది.

 త్రైమాసికవారీ(క్యూ4)గా నికర లాభం 20 శాతం క్షీణించింది.  తరుగుదల, ఎమారై్టజేషన్‌ వ్యయాలు 16 శాతం పెరిగి రూ. 13,596 కోట్లను తాకాయి. ఇబిటా 2 శాతం వృద్ధితో రూ. 42,748 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 2.57 లక్షల కోట్లను తాకింది. ఆయిల్‌ టు కెమికల్‌(ఓ2సీ) బిజినెస్‌ ఇబిటా 14 శాతం నీరసించి రూ. 13,093 కోట్లకు పరిమితమైంది. చమురు, గ్యాస్‌ ఇబిటా 30 శాతం జంప్‌చేసి రూ. 5,210 కోట్లయ్యింది. కేజీ డీ6 బ్లాక్‌ నుంచి రోజుకి 28.7 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. జూన్‌ చివరికల్లా ఆర్‌ఐఎల్‌ నికర రుణ భారం రూ. 1.12 లక్షల కోట్లకు చేరింది. 

జియో ఇన్ఫోకామ్‌ గుడ్‌ 
జియో ప్లాట్‌ఫామ్స్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12 శాతం వృద్ధితో రూ. 5,698 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం బలపడి రూ. 34,548 కోట్లను తాకింది. దీనిలో భాగమైన రిలయన్స్‌ టెలికం సరీ్వసుల విభాగం జియో ఇన్ఫోకామ్‌ స్టాండెలోన్‌ నికర లాభం వార్షికంగా 12 శాతం ఎగసింది. రూ. 5,445 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని రూ. 26,478 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య 48.97 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 181.7కు చేరింది. తలసరి డేటా వినియోగం రోజుకి 1జీబీని మించింది. దీంతో డేటా ట్రాఫిక్‌ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించింది. చైనా వెలుపల అతిపెద్ద 5జీ ఆపరేటర్‌గా జియో నిలుస్తోంది. 
ఆర్‌ఐఎల్‌ షేరు బీఎస్‌ఈలో 2 % క్షీణించి రూ. 3110 వద్ద ముగిసింది.   

రిటైల్‌ బాగుంది...
రిలయన్స్‌ రిటైల్‌ విభాగం ఆర్‌ఆర్‌వీఎల్‌ క్యూ1 నికర లాభం 5 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లయ్యింది. స్థూల ఆదాయం 8 శాతం ఎగసి రూ. 75,615 కోట్లను తాకింది.  ఇబిటా 10 శాతంపైగా పుంజుకుని రూ. 5,664 కోట్లకు చేరింది. 331 కొత్త స్టోర్లను తెరిచింది. దీంతో వీటి సంఖ్య 18,918ను తాకింది. మరోపక్క కొత్తగా 30 మెట్రో(హోల్‌సేల్‌) స్టోర్లకు తెరతీసింది. వీటి సంఖ్య 200కు చేరింది. జర్మన్‌ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 2022 డిసెంబర్‌లో రిలయన్స్‌ రూ. 2,850 కోట్లకు మెట్రో బిజినెస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

లాభాలు పటిష్టం 
కన్జూమర్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ బిజినెస్‌ ప్రభావంతో క్యూ1లో మెరుగైన ఇబిటాను సాధించాం. ఇది డైవర్స్‌ పోర్ట్‌ఫోలియో బిజినెస్‌కున్న పటిష్టతను ప్రతిఫలిస్తోంది. డిజిటల్‌ సర్వీసుల బిజినెస్‌ ప్రోత్సాహకర పనితీరు చూపుతోంది. రిటైల్‌ బిజినెస్‌ సైతం పటిష్ట ఆర్థిక ఫలితాలను సాధించింది.  
– ముకేశ్‌ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు