Breaking News

ఐదేళ్లలో రూ.9.63 లక్షలకోట్ల సంపద సృష్టి

Published on Mon, 12/18/2023 - 05:52

ఇన్వెస్టర్ల సంపద సృష్టికి గత ఐదేళ్ల కాలం(2018–23)లో డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టాప్‌ చెయిర్‌ను అలంకరించింది. ఈ బాటలో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌
రెండో ర్యాంకులో నిలవగా.. లాయిడ్స్‌ మెటల్స్, అదానీ గ్రూప్‌ సైతం ఇదే బాటలో నడవడం గమనార్హం! వివరాలు చూద్దాం..


న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే మార్కెట్‌ విలువ(క్యాపిటలైజేషన్‌)లో పలు దిగ్గజాలు గత ఐదేళ్లలో జోరు చూపాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేష్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌  ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అత్యధికంగా రూ. 9,63,800 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను జమ చేసుకుంది. నంబర్‌వన్‌ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్‌(టీసీఎస్‌) రూ. 6,77,400 కోట్ల విలువను జత చేసుకోవడం ద్వారా తదుపరి ర్యాంకును సాధించింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ నివేదిక ప్రకారం సంపద సృష్టిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభను కనబరిచింది. స్టాక్‌ మార్కెట్లో వివిధ కంపెనీల పనితీరును పరిశీలించిన మోతీలాల్‌ ఓస్వాల్‌ ఆర్‌ఐఎల్‌ వరుసగా ఐదో ఏడాదిలోనూ టాప్‌లో నిలిచినట్లు పేర్కొంది.

ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్‌
2018–23 కాలంలో ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ మార్కెట్‌ క్యాప్‌ రూ. 4,15,500 కోట్లమేర బలపడగా.. ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ విలువ రూ. 3,61,800 కోట్లు పుంజుకుంది. మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ రూ. 2,80,800 కోట్లను జత చేసుకుంది. అయితే లాయిడ్స్‌ మెటల్స్‌ అత్యంత వేగంగా 79 శాతం సంపదను పెంచుకున్న కంపెనీగా ఆవిర్భవించింది. ఈ బాటలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 78 శాతం వార్షిక వృద్ధితో ద్వితీయ ర్యాంకును సాధించింది.  ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ను మించుతూ అత్యంత నిలకడగా పురోగమించిన కంపెనీగా క్యాప్రి గ్లోబల్‌ నిలిచింది. ఏడాదికి 50 శాతం చొప్పున లాభపడింది.  

రూ. 10 లక్షలు.. ఐదేళ్లలో రూ.కోటి
గత ఐదేళ్లుగా అత్యున్నత ర్యాలీ చేసిన టాప్‌–10 కంపెనీలలో 2018లో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్‌ చేసి ఉంటే.. 2023కల్లా ఈ పెట్టుబడి రూ. కోటికి చేరి ఉండేదని నివేదిక పేర్కొంది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)