Breaking News

రిచ్ సపోర్ట్ సిరీస్‌.. నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి మంచి ఛాన్స్!

Published on Fri, 03/15/2024 - 18:19

రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), తెలంగాణ గవర్నమెంట్ చొరవతో.. అక్టోబర్ 2023లో SAMARTHan@RICH పేరుతో 'నెలవారీ సపోర్ట్ సిరీస్‌' (Monthly Support Series) ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా మెడికల్ టెక్నాలజీ (మెడ్‌టెక్) ఇన్నోవేటర్‌లు, స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి పుట్టుకొచ్చింది.

SAMARTHan@RICH నెలవారీ సపోర్ట్ సిరీస్‌ ద్వారా..  ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) అవగాహన & అప్లికేషన్ ప్రాసెస్, వైద్యుల నుంచి ఐడియా వ్యాలిడేషన్, ఉత్పత్తి అభివృద్ధి & వాణిజ్యీకరణ కోసం రెగ్యులేటరీ రోడ్‌మ్యాప్, క్లినికల్ ధ్రువీకరణ అధ్యయనాలను నిర్వహించడం వంటివి తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు IP ఏజెన్సీల నిపుణులు వంటి అనుభవజ్ఞులైన వైద్యులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో స్టార్టప్‌ల ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు.

విజ్ఞానం, నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా.. రెగ్యులేటరీ ల్యాండ్‌స్కేప్‌ను నావిగేట్ చేసుకోవచ్చు. వారి టెక్నాలజీలను మెరుగుపరచుకోవచ్చు. అంతే కాకుండా రోగుల జీవితాన్ని మార్చే పరిష్కారాలను వేగంగా అందించడానికి స్టార్టప్‌లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని RICH సీఈఓ 'రష్మీ పింపాలే' అన్నారు.

ఐడియా వ్యాలిడేషన్, క్లినికల్ వ్యాలిడేషన్, రెగ్యులేటరీ గైడెన్స్‌పై సెషన్‌లతో ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 2024లో ప్రారంభమైంది. దీని ద్వారా ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా.. సంచలనాత్మక పరిష్కారాల అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. SAMARTHan@RICH నెలవారీ ప్రాతిపదికలో పాల్గొనటానికి ఆసక్తి కలిగిన ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)