Breaking News

శంషాబాద్‌లో ప్రైవేట్‌ జెట్‌ టెర్మినల్‌

Published on Tue, 09/03/2024 - 08:55

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీఎంఆర్‌ గ్రూప్‌ ప్రకటించింది. ప్రైవేట్‌ విమానాల యజమానులు, సెలబ్రిటీలు, ఇతర వ్యాపారులు వారి అవసరాల నిమిత్తం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపింది. వీరి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిందని చెప్పింది. వారి అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక జనరల్ ఏవియేషన్ టెర్మినల్‌ను ప్రారంభించినట్లు ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ..‘వ్యాపారం లేదా వ్యక్తిగత ప్రయాణాల కోసం చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా తరచూ ప్రయాణించే ప్రీమియం ప్యాసింజర్లకు విలాసవంతమైన అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించాం. దేశంలో అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తుల (హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌) సంఖ్య పెరుగుతోంది. వీరు ప్రయాణ సమయాల్లో సాధారణ ప్రజలకంటే భిన్నంగా ప్రత్యేక సేవలు కోరుకుంటున్నారు. చాలామంది వ్యాపార కార్యకలాపాలు, వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్‌తోపాటు దాని చుట్టు పక్కన ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. దాంతో ధనవంతుల రాకపోకలు పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వారికి అవసరాలు తీర్చేలా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో జెట్‌ టెర్మినల్‌ను ప్రారంభించాం. దాంతో జీఎంఆర్‌ గ్రూప్‌ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.

ఇదీ చదవండి: మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధి

హైదరాబాద్‌ ఇప్పటికే ఫార్మా రంగంలో దూసుకుపోతుంది. ఇక్కడ తయారైన ఫార్మా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళజాతి సంస్థలు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఐటీ రంగంలో నగరం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నాయి. దాంతో వారి ప్రయాణాల సంఖ్య పెరుగుతోంది.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు