Breaking News

ఐటీ ఆదాయాల్లో 3–5 శాతం వృద్ధి

Published on Mon, 03/25/2024 - 06:28

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3–5 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్‌ తెలిపింది. ‘వృద్ధి వేగం పుంజుకునే వరకు ఈ రంగంలో నియామకాలు సమీప కాలంలో స్తబ్ధుగా ఉంటాయి. ఆదాయ వృద్ధిపై ఆందోళనల మధ్య కంపెనీల లాభదాయకత స్థితిస్థాపకంగా ఉంటుంది. 250 బిలియన్‌ డాలర్ల భారతీయ ఐటీ రంగానికి 2024–25లో నిర్వహణ లాభాల మార్జిన్లు 21–22 శాతానికి వస్తాయి.

2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పరిశ్రమ కేవలం 2 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. వాస్తవానికి 3–5 శాతం ఆదాయ వృద్ధి ఉంటుందని పరిశ్రమ గతంలో అంచనా వేసింది. 2022–23 ఏప్రిల్‌–డిసెంబర్‌లో ఇది 9.2 శాతం సాధించింది. యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో స్థిర, స్థూల ఆర్థికపర ఎదురుగాలుల నేపథ్యంలో కార్పొరేట్‌ కంపెనీలు ఐటీపై తక్కువ వ్యయం చేయడంతో 2024–25లో కూడా స్వల్ప ఆదాయ వృద్ధి అంచనాలకు దారితీసింది’ అని తెలిపింది.  

సగటు అట్రిషన్‌ 12–13 శాతం..
‘క్లిష్ట వ్యయాలు, వ్యయ నియంత్రణ ఒప్పందాలు కొనసాగనున్నాయి. ఇది భారతీయ ఐటీ సేవల కంపెనీల వృద్ధి అవకాశాలకు కొంతవరకు మద్దతునిస్తుంది. బలమైన ఆర్డర్‌ బుక్స్, వివిధ దశల్లో ఉన్న డీల్స్‌.. స్థూల ఆర్థికపర ఎదురుగాలులు తగ్గిన తర్వాత ఊపందుకుంటాయి. కార్పొరేట్‌ సంస్థలకు మహమ్మారి తర్వాత మొత్తం మూలధన కేటాయింపులకు టెక్‌ ఖర్చులు మరింత సమగ్రంగా మారాయి. నియామక కార్యకలాపాలు స్తబ్ధుగా ఉంటాయని అంచనా వేస్తున్నప్పటికీ అట్రిషన్‌ స్థాయిలు సమీప కాలంలో స్థిరపడతాయి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)