Breaking News

విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు ఝలక్!

Published on Thu, 02/12/2026 - 17:53

ఇండియా నుంచి వెళ్ళిపోయి.. యూకేలో ఉంటున్న విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు స్పందించింది. మీరు భారత్‌కు తిరిగి రావాలి, లేకుంటే.. మేము మీ పిటిషన్‌ (ఆర్థిక నేరస్థుల చట్టం, 2018)ను విచారించలేము వెల్లడించింది.

పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటే, ముందుగా మీరు (విజయ్ మాల్యా) భారతదేశానికి తిరిగి రావాలి. మేము ఇప్పటికీ కేసును కొట్టివేయడం లేదు.. మీకు మరొక అవకాశం ఇస్తున్నామని కోర్టు వెల్లడించింది. విదేశాల్లో ఉండి ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేరని స్పష్టం చేసింది.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టంగా వ్యాఖ్యానించింది. మీరు కోర్టు అధికార పరిధిని తప్పించుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో మీరు సమాన న్యాయం కోరలేరు. ముందుగా మీరు భారతదేశానికి తిరిగి రావాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే మాల్యా భారత్‌కు వస్తారా లేదా అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు ఫిబ్రవరి 18న మళ్లీ విచారణకు రానుంది.

ఆర్ధిక నేరాలకు పాల్పడి పరారీలో ఉన్న నిందితులు విచారణను ఎదుర్కొనేందుకు తిరిగి వచ్చేలా.. భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఇందులో విజయ్ మాల్యా మాత్రమే కాకుండా.. లలిత్ మోదీ కూడా ఉన్నారు. వీరిని తీసుకురావడానికి ప్రభుత్వం చురుకుగా ప్రయత్నిస్తోందని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే రష్యా ప్రయత్నం?

2018లో అమలులోకి వచ్చిన ఎఫ్ఈఓ చట్టం ప్రకారం.. మొత్తం 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులుగా ప్రకటించారు.  వీరిలో 9 మంది ప్రభుత్వ బ్యాంకులకు సుమారు రూ. 26,645 కోట్ల నష్టం కలిగించారు. 2025 అక్టోబర్ 31 వరకు వడ్డీ కలిపి ఈ మొత్తం రూ. 31,437 కోట్లకు చేరింది. ఇందులో రూ. 19,187 కోట్లు ఇప్పటివరకు తిరిగి వసూలు చేశారు.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)