హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్
Breaking News
నగరాల్లో రిటైల్ స్పేస్‌కు డిమాండ్
Published on Sun, 12/28/2025 - 04:37
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో రిటైల్ దుకాణ వసతులకు, ప్రధాన వీధుల్లోని రిటైల్ వసతులకు డిమాండ్ పెరుగుతున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది డిమాండ్ 15 శాతం పెరిగి 9 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్‌ఎఫ్‌టీ) లీజింగ్ చేరుకోవచ్చని అంచనా వెల్లడించింది. రిటైలర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెరగనున్నట్టు తెలిపింది. 2024లో ఇవే నగరాల్లో రిటైల్ వసతుల లీజింగ్ 7.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్‌తోపాటు చెన్నై, బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల డేటా ఇందులో ఉంది.
ప్రముఖ ప్రాంతాల్లో ఇలా..
టాప్–8 నగరాల్లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో (హై స్ట్రీట్ లొకేషన్లు) ఈ ఏడాది రిటైల్ వసతుల లీజింగ్ 5.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చన్నది కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ అంచనా. 2024లో ఇది 5.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇక షాపింగ్ మాల్స్‌లోని రిటైల్ దుకాణాల లీజంగ్ పరిమాణం 3.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకోవచ్చని తెలిపింది. 2023లో ఇది 2.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
2020లో కరోనా విపత్తు అనంతరం ఒక ఏడాదిలో రిటైల్ వసతుల అధిక లీజింగ్ ఈ ఏడాదే నమోదు కానున్నట్టు, క్యూ4లో (అక్టోబర్–డిసెంబర్) కొత్త మాల్స్ అందుబాటులోకి రానున్నట్టు కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఈడీ గౌతమ్ సరాఫ్ తెలిపారు. వచ్చే ఏడాది కూడా రిటైల్ వసతుల సరఫరా (కొత్తవి ప్రారంభం) మెరుగ్గా ఉంటుందని చెప్పారు.
కస్టమర్లు భౌతికంగా చూసి, కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, ప్రీమియమైజేషన్‌కు అనుగుణంగా రిటైల్ వసతుల విస్తరణ చోటుచేసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది కొత్త గ్రేడ్–ఏ మాల్స్ పూర్తి 0.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి పరిమితం కావొచ్చని, 2025లో కొత్త డెలివరీలు 4.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని ఈ నివేదిక వెల్లడించింది. మారుతున్న జీవనశైలులు, వినియోగదారుల ప్రాధాన్యతలతో రిటైల్ వసతులకు డిమాండ్ బలంగా కొనసాగుతున్నట్టు భారతి రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో ఎస్‌కే సన్యాల్ తెలిపారు. పట్టణాల్లో అనుసంధానత రిటైల్ వసతుల డిమాండ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.
Tags : 1