Breaking News

స్వల్పంగా పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 

Published on Sat, 09/13/2025 - 01:50

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో నమోదైన ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి నుంచి ఆగస్ట్‌ నెలలో కాస్తంత ఎగిసింది. జూలైలో 1.61% కాగా, ఆగస్ట్‌లో 2.07 శాతానికి చేరింది. కూరగాయలు, మాంసం, చేప లు, గుడ్లు, నూనెలు, ఫ్యాట్స్‌ ధరలు పెరగడం ఇందుకు దారితీసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్‌ ద్రవ్యోల్బణం) తొమ్మిది నెలల పాటు వరుస క్షీణతకు ఆగస్ట్‌లో బ్రేక్‌ పడినట్టయింది. 2024 ఆగస్ట్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.65 శాతంగా ఉంది.  

→ ఆహార ద్రవ్యోల్బణం మైనస్‌ 0.69 శాతంగా నమోదైంది. జూలైలో ఇది మైనస్‌ 1.76%గా ఉంది.  
→ కూరగాయల ధరలు 15.92% పడిపోయాయి.  
→ గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జూలైలో 1.18 శాతంగా ఉంటే, ఆగస్ట్‌లో 1.69 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 2.1 శాతం నుంచి 2.47 శాతానికి చేరింది. 

రానున్న నెలల్లో గమనించాలి.. 
ఆహారం, పానీయాల విభాగాల్లోని ధరల పెరుగుదల వల్లే సీక్వెన్షియల్‌గా (నెలవారీగా) రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో పెరగడానికి కారణమని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి సానుకూల ధోరణులు కనిపిస్తున్నప్పటికీ.. ఆగస్ట్‌ చివరి నుంచి సెపె్టంబర్‌ ఆరంభం వరకు అధిక వర్షాలు, వరదలు ఖరీఫ్‌ దిగుబడులపై ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. అంతిమంగా దిగుబడి, ధరల తీరును గమనించాల్సి ఉందన్నారు.  

Videos

మంత్రి నారాయణకు బిగ్ షాక్ డయేరియా బాధితుల ఫ్యామిలీ నిలదీత

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)