Breaking News

మరింత దిగొచ్చిన ధరలు

Published on Wed, 08/13/2025 - 00:37

న్యూఢిల్లీ: కూరగాయలు, ఆహారోత్పత్తులు, ధాన్యాల ధరలు మరింత కిందకు దిగొచ్చాయి. ఫలితంగా జూలై నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 1.55 శాతానికి పడిపోయింది. 2017 జూన్‌ నెలలో నమోదైన 1.46 శాతం తర్వాత ఇదే అత్యంత కనిష్ట రిటైల్‌ ద్రవ్యోల్బణం. ఈ ఏడాది జూన్‌ నెలలో ద్రవ్యోల్బణం 2.1 శాతంతో పోల్చి చూసినా 0.55 శాతం తక్కువగా నమోదైంది.

2024 జూన్‌ నెలలో ఇది 3.6%గా ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగిపోయిన తరుణంలో రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అన్నది వినియోగదారులతో పాటు విధాన నిర్ణేతలకూ ఉపశనమం కలిగిస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.  

ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం (కన్జ్యూమర్‌ ఫుడ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌/సీఎఫ్‌పీఐ) మైనస్‌ 1.76 శాతానికి క్షీణించింది. జూన్‌లో ఇది మైనస్‌ 1.01గా ఉంది. 2019 జనవరి తర్వాత ఆహార విభాగంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం ఇది. వరి, గోధుమ, చక్కెర, పప్పులు, ధాన్యాలు,  కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు ఈ విభాగం కిందకు వస్తాయి.  

గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలై నెలకు 1.18 శాతంగా నమోదైంది. జూన్‌లో ఇది 1.72 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంత ఆహార ద్రవ్యోల్బణం మైనస్‌ 1.74 శాతానికి పతనమైంది.   
పట్టణ ప్రాంతాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.05 శాతానికి తగ్గింది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)