Breaking News

ఏడు నెలల కనిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం.. ఐఐపీ అప్‌

Published on Thu, 03/13/2025 - 08:53

కూరగాయలు, గుడ్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఇతరత్రా పదార్ధాల రేట్లు నెమ్మదించడంతో ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన 3.61 శాతానికి దిగి వచ్చింది. ఇది గతేడాది జూలై తర్వాత కనిష్ట స్థాయి. తాజా పరిణామం నేపథ్యంలో వచ్చే నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ మరోసారి కీలక వడ్డీ రేట్ల కోతపై దృష్టి పెట్టడానికి కాస్త అవకాశం లభించినట్లవుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ 7–9 మధ్య ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష చేపట్టనుంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరిలో 4.26 శాతంగా, గతేడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదైంది.  ఆహార ద్రవ్యోల్బణం 222 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. 2023 మే తర్వాత ఇదే కనిష్టమని పేర్కొంది. కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, పప్పు ధాన్యాలు మొదలైన వాటి ధరల పెరుగుదల తగ్గడమే రిటైల్, ఆహార ద్రవ్యోల్బణాలు దిగి రావడానికి కారణమని వివరించింది.  

ఇదీ చదవండి: స్టార్‌లింక్‌కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్‌.. కాసేపటికే డిలీట్‌

జనవరిలో ఐఐపీ 5 శాతం అప్‌

తయారీ కార్యకలాపాలు పుంజుకోవడంతో దేశీయంగా పారిశ్రామికోత్పత్తి జనవరిలో మెరుగుపడింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 5%గా నమోదైంది. ఇది 2024 నవంబర్‌లో 5 శాతంగా ఉంది. 2024 డిసెంబర్‌ గణాంకాలను ప్రభుత్వం 3.2% నుంచి 3.5%కి సవరించింది. ఇక, గతేడాది జనవరిలో 3.6%గా ఉన్న తయారీ రంగ ఉత్పత్తి ఈ ఏడాది జనవరిలో 5.5%కి పెరిగింది. మరోవైపు, 2024–25 ఏప్రిల్‌–జనవరి మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 6 శాతం నుంచి 4.2 శాతానికి నెమ్మదించింది.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)