Breaking News

ఆహార ధరలు మరింత తగ్గాయ్‌..!

Published on Fri, 06/13/2025 - 04:23

న్యూఢిల్లీ: ధరలు మరింత దిగొచ్చాయి. మే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.82 శాతానికి తగ్గింది. 2019 ఫిబ్రవరిలో 2.57 శాతం తర్వాత తిరిగి కనిష్టానికి దిగి రావడం ఇదే మొదటిసారి. వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ/రిటైల్‌) ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో 3.16 శాతంగా ఉంటే, 2024 మే నెలలో 4.8 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఆహార ధరల విభాగంలో ద్రవ్యోల్బణం 0.99 శాతానికి పరిమితమైంది. 

ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 8.69 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. ఈ స్థాయికి దిగువనే ఉండడం సానుకూలించే అంశం. ఈ అంచనాల నేపథ్యంలోనే ఆర్‌బీఐ ఈ నెల ఆరంభంలో రెపో రేటును ఏకంగా అర శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. 

‘‘పప్పులు, వాటి సంబంధిత ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, ధాన్యం ఉత్పత్తులు, గృహ వినియోగ వస్తువులు, సేవల ద్రవ్యోల్బణం తగ్గడం మే నెలలో ఆహార, రిటైల్‌ ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదపడింది’’అని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ప్రకటించింది. ఆహార ద్రవ్యోల్బణం 2021 అక్టోబర్‌ తర్వాత కనిష్ట స్థాయిలో నమోదైనట్టు తెలిపింది. 

పట్టణాల్లో కాస్త ఎక్కువ..: మే నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2.59 శాతానికి పరిమితం అయితే.. పట్టణ ప్రాంతాల్లో ఇది 3.07 శాతంగా ఉంది. ముఖ్యంగా దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. 0.55 శాతంగా ఉంది. కాగా, అత్యధికంగా కేరళలో 6.46 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదైంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)