అవసరాలకు తగ్గ ప్రణాళిక.. ఆర్‌బీఐ

Published on Mon, 09/16/2024 - 07:37

న్యూఢిల్లీ: కరెన్సీ నిర్వహణ సదుపాయాలను వచ్చే 4–5 ఏళ్లలో సంపూర్ణంగా పునర్‌నిర్మించాలని ఆర్‌బీఐ ప్రణాళికతో ఉంది. ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధితో భవిష్యత్తులో ఏర్పడే కరెన్సీ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, స్టోరేజ్‌ (నిల్వ) వసతులు మెరుగుపరుచుకోవాలని అనుకుంటోంది. గ్రీన్‌ఫీల్డ్‌ కరెన్సీ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, నిల్వ కేంద్రాల ఆటోమేషన్, సెక్యూరిటీ, సర్వైలెన్స్‌ వ్యవస్థల ఏర్పాటు, ఇన్వెంటరీ నిర్వహణ విధానం, కేంద్రీకృత నిర్వహణ కేంద్రం ఇవన్నీ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్‌ అమలు కాలం 4–5 ఏళ్లుగా ఉంది.

కరెన్సీ నిర్వహణ వసతుల ఆధునికీకరణకు సంబంధించి కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవల కోసం ఆర్‌బీఐ ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)లకు ఆహ్వానించింది. ఈ డాక్యుమెంట్‌ను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. ‘‘గడిచిన మూడేళ్లలో చలామణిలో ఉన్న నోట్ల పెరుగుదల మోస్తరుగా ఉన్నప్పటికీ, వచ్చే దశాబ్ద కాలంలో దాని వేగం మందగించే అవకాశం ఉంది. అయినా కానీ సమీప కాలంలో వృద్ధి సానుకూలంగా ఉంటుందని విశ్లేషణ తెలియజేస్తోంది.

గడిచిన రెండు దశాబ్దాల్లో చలామణిలో ఉన్న నోట్లు చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. 2023 మార్చి 31 నాటికి 136.21 బిలియన్‌ పీసుల నోట్లఉండగా, 2024 మార్చి 31 నాటికి 146.88 బిలియన్‌ పీసులకు పెరిగాయి. కాయిన్ల చలామణి సైతం ఇదే కాలంలో 127.92 బిలియన్‌ పీసుల నుంచి 132.35 బిలియన్‌ పీసులకు వృద్ధి చెందింది’’అని ఆర్‌బీఐ టెండర్‌ డాక్యుమెంట్‌ పేర్కొంది. ఈ పెరిగే అవసరాలకు తగ్గట్టు సదుపాయాలను మెరుగుపరుచుకునే క్రమంలో భాగంగా ఆర్‌బీఐ ఈవోఐలకు ఆహ్వానం పలికింది.

#

Tags : 1

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)