Breaking News

గోల్డ్‌ బాండ్‌ @ రూ. 6,199

Published on Sat, 12/16/2023 - 06:29

ముంబై: తదుపరి దశ సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల(ఎస్‌జీబీ)కు రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) తాజాగా ధరను ప్రకటించింది. ఒక గ్రాము బాండుకు రూ. 6,199ను నిర్ణయించింది. వీటి సబ్‌్రస్కిప్షన్‌ ఈ నెల సోమవారం(18న) ప్రారంభమై ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఎస్‌జీబీ పథకం 2023–24– సిరీస్‌–3లో భాగంగా ఆర్‌బీఐ ఈ నెల 18–22 మధ్య పసిడి బాండ్ల సబ్ర్‌స్కిప్షన్‌కు తెరతీస్తోంది.

స్మాల్, పేమెంట్, గ్రామీణ బ్యాంకులు మినహా షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు వీటిని విక్రయిస్తాయి. వీటితోపాటు స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్, క్లియరింగ్‌ కార్పొరేషన్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పూర్తి స్వచ్ఛత(999)గల పసిడి సగటు ముగింపు ధర ఆధారంగా గ్రాముకు రూ. 6,199 ధరను నిర్ధారించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

ఆర్‌బీఐతో చర్చల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకు రూ. 50 చొ ప్పున ఇన్వెస్టర్లకు డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయడంతోపాటు.. డిజిటల్‌ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది. వెరసి గోల్డ్‌ బాండ్‌ రూ. 6,149కు లభించనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. కాగా.. ఎస్‌జీబీ సిరీస్‌–4లో భాగంగా వచ్చే (2024) ఫిబ్రవరి 12–16 మధ్య బాండ్లను ఆఫర్‌ చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)