Breaking News

కేవైసీ అప్‌డేషన్‌ ఇక ఈజీ!

Published on Fri, 06/13/2025 - 04:06

ముంబై: కాలానుగుణంగా కేవైసీ అప్‌డేషన్‌ను మరింత సులభతరం చేసే దిశగా ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ అప్‌డేషన్‌ సేవలను బిజినెస్‌ కరస్పాడెంట్ల ద్వారా (బీసీలు) చేపట్టేందుకు అనుమతించింది. కస్టమర్లకు నిర్ణిత గడువుతో ముందస్తు నోటీసులు/సమాచారం ఇవ్వాలంటూ బ్యాంక్‌లతోపాటు తన నియంత్రణల పరిధిలోని ఆర్థిక సంస్థలను (ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు తదితర) ఆర్‌బీఐ కోరింది. ‘‘ఖాతాల కేవైసీ అప్‌డేషన్‌ విషయంలో పెద్ద ఎత్తున పెండింగ్‌ ఉన్నట్టు గమనించాం. 

ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం, స్కాలర్‌ షిప్‌ ప్రయోజనాల కోసం తెరిచిన ఖాతాలు, ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన (పీఎంజేడీవై) ఖాతాల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది’’అని ఆర్‌బీఐ ఆదేశాల్లో పేర్కొంది. కస్టమర్ల సౌకర్యం దృష్ట్యా బిజినెస్‌ కరస్పాడెంట్ల (బీసీలు)ను కేవైసీ అప్‌డేషన్‌ పనుల నిర్వహణకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు, బ్యాంక్‌ శాఖలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల కస్టమర్లకు సైతం కేవైసీ అప్‌డేషన్‌ సులభతరం కానుంది. ఇందుకు వీలుగా సవరించిన కేవైసీ ఆదేశాలను జారీ చేసింది.  

3 పర్యాయాలు సమాచారం ఇవ్వాల్సిందే.. 
కాలానుగుణ కేవైసీ అప్‌డేషన్‌ విషయంలో కస్టమర్లకు బ్యాంక్‌లు ముందస్తు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. కనీసం మూడు పర్యాయాలు కస్టమర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒక్కసారి లేఖ ద్వారా తెలియజేయాలని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రతి ఇంటిమేషన్‌/రిమైండర్‌ను నమోదు చేయాలని కూడా ఆదేశించింది. కేవైసీ వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోతే కస్టమర్‌ నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకుంటే సరిపోతుంది. తక్కువ రిస్క్ లో ఉన్న కస్టమర్లు గడువులోపు కేవైసీ అప్‌డేట్‌ చేయకపోయినప్పటికీ.. అప్పటి నుంచి ఏడాది పాటు లేదా 2026 జూన్‌ 30 వరకు వారి ఖాతాల్లో అన్ని లావాదేవీలను అనుమతించాలని 
ఆర్‌బీఐ కోరింది. కేవైసీ అప్‌డేషన్‌ విషయంలో క్యాంపులు నిర్వహించి కస్టమర్లలో అవగాహన కల్పించాలని సూచించింది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)