Breaking News

ఈ ఏడాది సగటున వేతన పెంపు ఎంతంటే..

Published on Thu, 02/20/2025 - 15:11

దేశంలో 2025 ఏడాదిలో ఉద్యోగుల జీతాలు సగటున 9.2 శాతం పెరగనున్నాయని ఏఓఎన్ తాజా నివేదికలో వెల్లడించింది. 2024లో కనిపించిన 9.3 శాతం పెరుగుదలతో పోలిస్తే 2025లో వేతనాల పెంపు స్వల్పంగా క్షీణిస్తుందని నివేదిక తెలిపింది. ఇందుకు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, మందగమనం ప్రధాన కారణాలని విశ్లేషించింది.

రంగాల వారీగా ఇంక్రిమెంట్లు

రంగాల వారీగా వేతనాల పెంపులో మార్పులు వస్తున్నాయి. నివేదిక ప్రకారం కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు అధిక వేతన పెంపు ఉంటుంది. ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్, ఆటోమోటివ్, వెహికల్ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లలో అత్యధికంగా 10.2 శాతం వేతన పెంపు ఉంటుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), రిటైల్ వంటి ఇతర రంగాల్లోనూ గణనీయమైన వేతన పెరుగుదలను చూడవచ్చని భావిస్తున్నారు.

ఆర్థిక స్థిరత్వం

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ ఆర్థిక అవకాశాలు నిలకడగానే ఉన్నాయి. గ్రామీణ గిరాకీ మెరుగవుతోంది. ప్రైవేటు వినియోగం ఊపందుకుంటోంది. ఈ స్థిరత్వం ఉద్యోగులకు సానుకూల సంకేతంగా భావించవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన వృద్ధి పథాన్ని సూచిస్తుంది. 2022లో గరిష్టంగా 21.4 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు(ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారడం) 2024 నాటికి 17.7 శాతానికి పడిపోయింది. టాలెంట్ పూల్ స్థిరపడడాన్ని ఇది సూచిస్తుంది.

ఇదీ చదవండి: భారత్‌లోకి టెస్లా.. మస్క్‌ వైఖరి ‘చాలా అన్యాయం’

రంగాల వారీగా గతేడాదితో పోలిస్తే వేతనాల్లో వ్యత్యాసం ఇలా..(శాతాల్లో)

రంగాలు                           2024   2025

ఇంజినీరింగ్‌ డిజైన్‌ సర్వీసెస్‌  10.1    10.2
ఆటోమోటివ్‌                      10.7    10.2
ఎన్‌బీఎఫ్‌సీ                       10.1    10
రిటైల్‌                               9.6      9.8
గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌      9.4      9.7
ఇంజినీరింగ్‌/మ్యానుఫ్యాక్చరింగ్‌ 9.7  9.7
ఫండ్స్‌/ అసెట్‌ మేనేజ్‌మెంట్‌  10      9.7
ఫ్రొఫెషనల్‌ సర్వీసెస్‌             8.9     9.5
లైప్‌ సైన్సెస్‌                       9.5     9.5
టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌           9.5     9.4
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)