Breaking News

విద్యుత్‌ వ్యవస్థకు పునరుత్పాదక‘శక్తి’ కావాలి!

Published on Fri, 07/14/2023 - 06:07

న్యూఢిల్లీ: భారత్‌ వాతావరణ (పర్యావరణ పరిరక్షణ) లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్‌ వ్యవస్థలో మరింత పునరుత్పాదక శక్తిని అనుసంధానం చేయడం చాలా కీలకమని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎనర్జీ ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌ (ఐఈఈఎఫ్‌ఏ) తెలిపింది. దేశ విద్యుత్‌ వ్యవస్థలో క్లీన్‌ ఎనర్జీ వాటాను పెంచడానికి వివిధ చర్యలను కూడా సూచించింది. 

2030 నాటికి ఉద్గారాల తీవ్రత తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్‌ పునరుత్పాదక ఇంధనంపై అత్యధిక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  ఇందుకు అనుగుణంగా తన విద్యుత్‌ వ్యవస్థలో క్లీన్‌ ఎనర్జీ వాటాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐఈఈఎఫ్‌ఏ ఎనర్జీ అనలిస్ట్, నివేదిక రచయిత చరిత్‌ కొండా తెలిపారు. 2030 నాటికి నాన్‌–ఫాసిల్‌ ఫ్యూయల్‌ పవర్‌ ఇన్‌స్టాల్‌ కెపాసిటీ వాటాను 50 శాతానికి పెంచడం ఎంతో ముఖ్యమని కొండా పేర్కొన్నారు.

2005 స్థాయిల నుండి 2030 నాటికి దాని ఆర్థిక వ్యవస్థ యొక్క ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడానికి విద్యుత్‌ వ్యవస్థలో వేరియబుల్‌ పునరుత్పాదక శక్తిని పెంచడం అవసరమన్నారు. స్థిరమైన టారిఫ్‌లకు బదులుగా ఎఫెక్టివ్‌ టైమ్‌–ఆఫ్‌–యూజ్‌ (టీఓయూ) విద్యుత్‌ టారిఫ్‌లను ప్రవేశపెట్టడం, విద్యుత్‌ రంగానికి మరింత పునరుత్పాదక ఇంధన అనుసంధానం వల్ల భారీ ప్రయోజనాలు ఒనగూరుతాయని,  ముఖ్యంగా వినియోగ విధానాల్లో గణనీయమైన మార్పును చూడవచ్చని నివేదిక తెలిపింది. టీఓయూ ప్రైసింగ్‌ వల్ల పీక్‌ డిమాండ్‌ (కీలక సమాయాల్లో విద్యుత్‌ వినియోగం) 5 నుంచి 15 శాతం తగ్గుతుందని నివేదిక అభిప్రాయడింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)