Breaking News

ఈ కార్ల కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్స్ - పూర్తి వివరాలు

Published on Thu, 12/28/2023 - 21:12

ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్ ఇండియా' ఈ ఏడాది బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి కోసం అద్భుతమైన ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్‌ వంటి వున్నాయి. కంపెనీ అందించే ఈ బెనిఫిట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రెనాల్ట్ కైగర్
కంపెనీ తన రెనాల్ట్ కైగర్ కొనుగోలుపైన రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 స్పెషల్ కస్టమర్ లాయల్టీ బోనస్‌లు, రూ.12,000 కార్పొరేట్ బెనిఫిట్స్ మొదలైనవి ఉన్నాయి. 1.0 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్
రెనాల్ట్ ట్రైబర్ కొనుగోలుపైన కంపెనీ రూ.50000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, రూ.10,000 లాయల్టీ కస్టమర్ ప్రయోజనాల కింద తగ్గింపు ఉన్నాయి. రూ.6.34 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారును ఈ నెలలో కొనుగోలు చేస్తే రూ.50,000 వరకు సేవ్ అవుతుంది.

ఇదీ చదవండి: 2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్

రెనాల్ట్ క్విడ్
ప్రారంభం నుంచి అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న రెనాల్ట్ క్విడ్ కొనుగోలుపైన కంపెనీ ఇప్పుడు రూ. 50000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్‌ వంటివి ఉన్నాయి. రూ.4.5 లక్షల ప్రారంభ ధరలో లభించే ఈ కారుని ఇప్పుడు రూ.50,000 తగ్గింపుతో ఈ నెలలో కొనుగోలు చేయవచ్చు.

Note: రెనాల్ట్ కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ అందించే తగ్గింపులు కేవలం మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి వినియోగదారులు సమీపంలోని అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవాలి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)