Breaking News

ఇల్లమ్మితే... బోలెడు నష్టం!

Published on Fri, 07/26/2024 - 18:13

కేంద్ర బడ్జెట్ 2024లో ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగిస్తే.. రియల్ ఎస్టేట్‌లో భారీగా నల్లధనం వచ్చి చేరుతుంది. కాబట్టి దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు ఇండెక్సేషన్‌ను తొలగించడం ద్వారా పెట్టుబడిదారీ వర్గం వెనుకడుగు వేస్తుంది. ఇండెక్సేషన్‌ను తీసివేయడం అంటే పన్ను విధించడం కాదు.. పెట్టుబడిదారులకు జరిమానా విధించడంతో సమానం అని అన్నారు.

2024 బడ్జెట్‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ప్రతిపాదనలో పాత ఆస్తులను విక్రయించే వ్యక్తులు అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుందని రాఘవ్ చద్దా తెలిపారు.

బడ్జెట్‌లో, ప్రభుత్వం స్థిరాస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడానికి ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించింది. ఇండెక్సేషన్‌ను పునరుద్దరించకపోతే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు తగ్గుతాయి, ప్రజలు తమకు నచ్చిన డ్రీమ్ హోమ్‌లను కొనుగోలు చేయడం సాధ్యం కాదని చద్దా అన్నారు.

ఇండెక్సేషన్ అనేది బాండ్లు, స్టాక్‌లు, రియల్‌ ఎస్టేట్‌ వంటి పెట్టుబడులను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసే పద్ధతి. సాధారణంగా ఇందులో పెట్టుబడి ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయి. అయితే ద్రవ్యోల్బణం వల్ల వాస్తవ పెట్టుబడి విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో అప్పటికి ఉన్న ధరలకు అనుకూలంగా అడ్జస్ట్ చేయడానికి ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)