Breaking News

ఆధ్యాత్మిక పర్యాటకంతో ఉపాధి

Published on Fri, 02/23/2024 - 04:48

ముంబై:  ఆధ్యాత్మిక పర్యాటకంతో వచ్చే 4–5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గ్లోబల్‌ టెక్నాలజీ, డిజిటల్‌ టాలెంట్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఎన్‌ఎల్‌బీ సరీ్వసెస్‌ తెలిపింది. భారత్‌లో ఈ రంగం 2023–30 మధ్య ఏటా 16 శాతం వృద్ధి చెందుతుందని సంస్థ సీఈవో సచిన్‌ అలుగ్‌ ఒక అంచనాగా చెప్పారు. ‘దేశీయ టూరిజంలో ఆధ్యాత్మిక పర్యాట కం వాటా ఏకంగా 60 శాతముంది.

2028 నాటికి ఈ విభాగం 60 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయగలదు. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగ అవకాశాలకు కొత్త వేదికలను సృష్టిస్తుంది. కోవిడ్‌ మహ మ్మారి తర్వాత యాత్రలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021–22లో ఆధ్యాత్మిక  చందాలు 14 శాతం అధికం అయ్యాయి. అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన రామ్‌ మందిర్‌తో ఆధ్యాత్మిక పర్యాటకానికి జోష్‌ నింపనుంది.

ఒక్క రామ్‌ మందిర్‌ రాక కారణంగా వంటవారు, ఫ్రంట్‌ డెస్క్‌ మేనేజర్, హౌజ్‌కీపింగ్, టూర్‌ గైడ్స్‌ వంటి సుమారు 25,000 జాబ్స్‌ కొత్తగా రానున్నాయి. ఆహార సేవలు, కంజ్యూమర్‌ గూడ్స్, ఆతిథ్యం, రవాణా, మతపర ఉత్పత్తులు, చేతివృత్తులు, వ్రస్తాలు, సరుకు రవాణా, గిడ్డంగులు, ప్యాకింగ్‌ తదితర విభాగాల్లో కొత్తగా వ్యాపార అవకాశాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకులకు ప్రత్యేకంగా సేవలందించే కొత్త సంస్థల సంఖ్యలో 6–8 శాతం పెరుగుదల అంచనా వేస్తున్నాము’ అని వివరించారు.

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)