Breaking News

ఇక రిలయన్స్‌ ‘స్నాక్స్‌’!

Published on Fri, 11/08/2024 - 04:17

ముంబై: పంపిణీదార్లకు అధిక మార్జిన్లను అందిస్తూ క్యాంపాతో సాఫ్ట్‌డ్రింక్స్‌ మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌) తాజాగా స్నాక్స్‌ మార్కెట్‌పైనా గురిపెట్టింది. చిప్స్, బిస్కెట్స్‌ మొదలైన వాటి విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. సూపర్‌ స్టాకిస్ట్స్‌లకు మిగతా బ్రాండ్స్‌ అందించే 3–5 శాతంతో పోలిస్తే (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కూడా కలిపి) దాదాపు రెట్టింపు ఇస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు వివరించాయి. ఆర్‌సీపీఎల్‌ 6.5 శాతం ట్రేడ్‌ మార్జిన్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 

ఇక డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో చూస్తే 8 శాతం మార్జిన్లతో పాటు అదనంగా 2 శాతం (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు సహా) ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. సాధారణంగా డి్రస్టిబ్యూటర్లకు ఇతర స్నాక్‌ బ్రాండ్స్‌ 6–6.5 శాతం ఆఫర్‌ చేస్తుంటాయి. ఆర్‌సీపీఎల్‌ అటు రిటైలర్లకు ఏకంగా 20 మార్జిన్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ సెగ్మెంట్లో చాలాకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న బ్రిటానియా, పెప్సీకో, స్థానిక కంపెనీలు, ఇతర బ్రాండ్లు ఇచ్చేది 8–15 శాతంగా (మార్జిన్లు, స్కీములు కలిపి) ఉంటోంది. ఆర్‌సీపీఎల్‌ ప్రస్తుతం చిప్స్, నమ్‌కీన్స్‌ వంటి స్నాక్స్‌కి సంబంధించి అలాన్‌ బ్యూగుల్స్, స్నాక్‌ట్యాక్‌ బ్రాండ్లను, ఇండిపెండెన్స్‌ పేరిట బిస్కట్‌ బ్రాండ్‌ను  విక్రయిస్తోంది.

42 వేల కోట్ల మార్కెట్‌..
అధ్యయనాల ప్రకారం దేశీయంగా స్నాక్స్‌ మార్కెట్‌ 2023లో సుమారు రూ. 42,695 కోట్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 9.08 శాతం వృద్ధి చెందుతూ 2032 నాటికి రూ. 95,522 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. దేశీ ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా ఆర్‌సీపీఎల్‌  2022లో ప్రకటించింది. ఆ తర్వాత నుంచి కంపెనీ క్రమంగా కోలా మార్కెట్లోకి చొచ్చుకుపోయే వ్యూహాలను అమలు చేయడం మొదలెట్టింది. 

పోటీ సంస్థలతో పోలిస్తే ఉత్పత్తులను తక్కువ ధరకే అందించడం, పంపిణీదార్లకు అధిక మార్జిన్లు ఇవ్వడం మొదలైనవి అమలు చేసింది. అమెరికాకు చెందిన అలాన్‌ బ్యూగుల్స్‌ బ్రాండ్‌ను భారత్‌కి తెస్తున్నట్లు గతేడది మే నెలలో ప్రకటించింది. సాల్టెడ్‌తో పాటు టొమాటో, చీజ్‌ తదితర ఫ్లేవర్లలో రూ. 10కే అందించనున్నట్లు పేర్కొంది. సాధారణంగా పెద్ద సంస్థలు మార్కెటింగ్‌ కోసం కేటాయించే దానిలో 10–15 శాతం కూడా ఖర్చు చేయకుండానే అమ్మకాలను పెంచుకునేందుకు సేల్స్‌ వ్యవస్థను కూడా ఆర్‌సీపీఎల్‌ పటిష్టం చేసుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిటైల్‌ స్టోర్స్‌లో వినియోగదార్ల దృష్టిని ఆకర్షించేందుకు మరిన్ని లాంచ్‌ ప్రమోషన్లను ఆఫర్‌ చేస్తోందని పేర్కొన్నాయి.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)