రిఫైనింగ్‌ మార్జిన్లు పెరిగినా.. రిటైల్‌పై అనిశ్చితి

Published on Tue, 11/26/2024 - 13:34

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పనితీరు ఇటీవల మందగించడానికి కారణమైన రిఫైనింగ్‌ మార్జిన్లు పుంజుకున్నా, రిటైల్‌ విభాగం తీరుతెన్నులను అంచనా వేయడం కష్టతరమేనని బ్రోకరేజి సంస్థ జేపీ మోర్గాన్‌ పేర్కొంది. రిటైల్‌ ఆదాయంపై అనిశ్చితి నెలకొన్నట్లు ఒక నివేదికలో వివరించింది. మార్కెట్లు బలహీనంగా ఉండడంతో జియో/రిటైల్‌ విభాగాల లిస్టింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

నివేదిక ప్రకారం జూన్‌ నుంచి గణనీయంగా పడిపోయిన రిఫైనింగ్‌ మార్జిన్లు క్రమంగా మెరుగుపడ్డాయి. అయితే, రిటైల్‌ రంగం మందగమనంతో పాటు కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రభావాలు ఉండటంతో రిలయన్స్‌ రిటైల్‌కి సంబంధించి సమీప భవిష్యత్తు అంచనాలను వేయలేని పరిస్థితి నెలకొందని నివేదిక వివరించింది. జులై 8 నాటి గరిష్ట స్థాయి నుంచి రిలయన్స్‌ షేరు 22 శాతం క్షీణించిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా వాటితో పోలిస్తే రిలయన్స్‌ ఆకర్షణీయమైన ధరలో లభిస్తోందనే అభిప్రాయాలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: ఆర్‌బీఐ గవర్నర్‌కు ఛాతీ నొప్పి

రిలయన్స్‌లో ప్రధానంగా మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. మొదటిది ఆయిల్‌ రిఫైనింగ్‌.. పెట్రోకెమికల్, రెండోది టెలికం విభాగం జియో, మూడోది రిటైల్‌ సెగ్మెంట్‌. వీటితో పాటు మీడియా, న్యూఎనర్జీ వ్యాపారాలూ ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్‌ ఆదాయంలో సుమారు 50 శాతం వాటా రిటైల్, టెలికం విభాగాలదే కావడం విశేషం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)