Breaking News

రిలయన్స్‌ లాభం అప్‌

Published on Fri, 01/17/2025 - 02:04

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 7 శాతంపైగా వృద్ధితో రూ. 18,540 కోట్లను తాకింది. ప్రధానంగా టెలికం, రిటైల్‌ విభాగాలకుతోడు చమురు, పెట్రోకెమ్‌ బిజినెస్‌ నిలకడైన వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 17,265 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జులై–సెపె్టంబర్‌(క్యూ2)లో ఆర్జించిన రూ. 16,563 కోట్లతో పోలి్చనా నికర లాభం బలపడింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం అధికంగా రూ. 2.67 లక్షల కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 8 శాతం పుంజుకుని రూ.48,003 కోట్లకు చేరుకుంది.  

రిటైల్, ఆయిల్‌ గుడ్‌... 
రిటైల్‌ విభాగం రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ నికర లాభం క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ. 3,458 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 90,333 కోట్లయ్యింది. కొత్తగా 779 స్టోర్లను ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య 19,102కు చేరింది. జామ్‌నగర్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ ప్లాంట్లతోకూడిన ఆయిల్‌ టు కెమికల్స్‌ బిజినెస్‌ ఇబిటా 2 శాతం పుంజుకుని రూ. 14,402 కోట్లను తాకింది. ఇంధన రిటైల్‌ విభాగం జియో–బీపీ రికార్డ్‌ అమ్మకాలు(పెట్రోల్, డీజిల్‌) సాధించినట్లు ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. కేజీ డీ6 బ్లాకు నుంచి తగ్గిన గ్యాస్‌ ఉత్పత్తి కారణంగా ఇబిటా 4 శాతం నీరసించి రూ. 5,565 కోట్లకు పరిమితమైంది. సగటున గ్యాస్‌ ఉత్పత్తి రోజుకి 28.04 
మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్లుకాగా.. 21,000 బ్యారళ్ల చమురు ఉత్పత్తిని సాధించింది. 

యూఎస్‌ లగ్జరీ స్టోర్లు: ఫ్రాంచైజీ ఒప్పందం ద్వారా యూఎస్‌ లగ్జరీ రిటైలర్‌ ‘శాక్స్‌ ఫిఫ్త్‌ ఎవెన్యూ’ స్టోర్లకు దేశీయంగా తెరతీయనున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ పేర్కొంది. వెరసి అమెరికన్‌ లగ్జరీ డిపార్ట్‌మెంట్‌ స్టోర్లను దేశీయంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా మదర్‌కేర్‌ పీఎల్‌సీతో జేవీని నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. తద్వారా తల్లిదండ్రులు, పిల్లల ఉత్పత్తులందించే మదర్‌కేర్‌ బ్రాండును దేశీయంగా పరిచయం చేయనున్నట్లు తెలియజేసింది.  
ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ షేరు 2% లాభంతో రూ. 1,275 వద్ద ముగిసింది.

జియో దూకుడు 
ఆర్‌ఐఎల్‌ టెలికం విభాగం రిలయన్స్‌ జియో ఈ ఏడాది క్యూ3లో రూ. 6,477 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో సాధించిన రూ. 5,208 కోట్లతో పోలిస్తే 24 శాతం ఎగసింది. ప్రధానంగా టారిఫ్‌ల పెంపు ఇందుకు దోహదపడింది. మొత్తం ఆదాయం సైతం రూ. 25,368 కోట్ల నుంచి రూ. 29,307 కోట్లకు జంప్‌ చేసింది. త్రైమాసికవారీగా కస్టమర్ల సంఖ్య 47.88 కోట్ల నుంచి 48.21 కోట్లకు బలపడగా.. ఒక్కో యూజర్‌పై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ. 195.1 నుంచి రూ. 203.3కు ఎగసింది.  టెలికం, డిజిటల్‌ విభాగాల జియో ప్లాట్‌ఫామ్స్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 6,861 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 19% అధికమై రూ. 38,750 కోట్లకు చేరింది. 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)