Breaking News

ఆర్‌ఐఎల్‌ @ రూ. 20 లక్షల కోట్లు 

Published on Fri, 06/27/2025 - 05:55

న్యూఢిల్లీ:  డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మార్కెట్‌ విలువ మరోసారి రూ. 20 లక్షల కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. షేరు ధర తాజాగా 2 శాతం పుంజుకుని రూ. 1,495కు చేరడంతో బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 37,838 కోట్లు బలపడింది. వెరసి బ్లూచిప్‌ కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 20,23,375 కోట్లను అధిగమించింది. ప్రధాన ఇండెక్సులలో అధిక వెయిటేజీ గల కంపెనీ షేరు లాభపడటంతో మార్కెట్లకు సైతం జోష్‌వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ఇంతక్రితం గతేడాది(2024) ఫిబ్రవరి 13న రూ. 20 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సాధించిన తొలి దేశీ దిగ్గజంగా రిలయన్స్‌ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఆర్‌ఐఎల్‌ తదుపరి ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ రూ. 15,51,219 కోట్ల మార్కెట్‌ విలువతో రెండో స్థానాన్ని పొందింది. ఈ బాటలో మార్కెట్‌ విలువ ద్వారా ఇతర బ్లూచిప్‌ కంపెనీలు టీసీఎస్‌(రూ. 12,45,219 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్‌(రూ. 12,45,219 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌(రూ. 10,27,839 కోట్లు) తదుపరి ర్యాంకులలో నిలుస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది ఆర్‌ఐఎల్‌ షేరు ఇప్పటివరకూ 23 శాతం జంప్‌చేయడం విశేషం!

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)