Breaking News

మీడియా ప్రచారంలో రిలయన్స్‌ టాప్‌

Published on Tue, 12/09/2025 - 06:19

న్యూఢిల్లీ: మీడియా ప్రచారంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రారాజుగా నిలుస్తోంది. దేశీ మీడియాలో ఎక్కువగా కనిపించే లిస్టెడ్‌ కంపెనీగా విజికీ న్యూస్‌మేకర్‌ ఇండెక్స్‌లో వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నట్టు విజికీ న్యూస్‌మేకర్‌ ర్యాంకింగ్స్‌ 2025 ప్రకటించింది. సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్తల స్కోరు 2021లో 84.9గా ఉంటే, 2022లో 92.56, 2023లో 96.46, 2024లో 97.43, 2025లో 97.83కు క్రమంగా పెరుగుతూ వచ్చింది. 

అంటే మీడియా ప్రచారంలో రిలయన్స్‌ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నట్టు ఈ డేటా తెలియజేస్తోంది. ఏఐ, మెషీన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా, మీడియా అనలైటిక్స్‌ ద్వారా 4 లక్షలకు పైగా ప్రచురణల్లో బ్రాండ్‌కు ఉన్న ప్రచారం, గుర్తింపును విజికీ న్యూస్‌మేకర్‌ ర్యాంకింగ్స్‌ విశ్లేíÙస్తుంటుంది. ప్రభుత్వరంగ అగ్రగామి బ్యాంక్‌ ఎస్‌బీఐ 92.81 స్కోరుతో రెండో స్థానంలో ఉంటే, 88.41 స్కోరుతో హెచ్‌డీఎఫ్‌సీ మూడో స్థానంలో నిలిచింది.

 భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, ఐటీసీ టాప్‌–10లో ఉన్నాయి. జొమాటో 11, స్విగ్గీ 12, వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం) 13వ ర్యాంక్‌ దక్కించుకున్నాయి. బ్రాండ్‌ వారీ వార్తల పరిమాణం, ప్రముఖ వార్తల్లో వాటికి దక్కిన స్థానం, ఆయా ప్రచురణలకు ఉన్న విస్తరణ, రీడర్లు ఆధారంగా 0 నుంచి 100 వరకు స్కోర్‌ను విజికీ న్యూస్‌మేకర్స్‌ ర్యాంకింగ్స్‌ కేటాయించింది. నాలుగు లక్షలకు పైగా ప్రచురణల్లో ఒక్కో బ్రాండ్‌కు సంబంధించి ఎన్ని వార్తలు వచ్చాయి, ఏ బ్రాండ్‌కు తరచూ ప్రచారం లభిస్తోందన్న అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)