Breaking News

నమ్ముకున్న ఉద్యోగులకు అనిల్‌ అంబానీ వరాలు

Published on Fri, 11/14/2025 - 13:43

అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌ తొలిసారిగా తమ గ్రూప్‌లోని రెండు సంస్థల ఉద్యోగులకు స్టాక్‌ ఆప్షన్స్‌ను (ఎసాప్స్‌) ప్రకటించింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా (ఆర్‌ఇన్‌ఫ్రా), రిలయన్స్‌ పవర్‌లోని 2,500 మంది ఉద్యోగులకు ఇవి లభిస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది.

దీని ప్రకారం రూ. 10 ముఖ విలువ గల షేరును అదే విలువకు ఉద్యోగులకు కేటాయిస్తారు. దీర్ఘకాలంగా, నమ్మకంగా కొనసాగుతున్న చాలా మటుకు ఉద్యోగుల సేవలకు గుర్తింపుగా నవంబర్‌ 3న ఎసాప్స్‌ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపినట్లు కంపెనీ వివరించింది. రిలయన్స్‌ గ్రూప్‌లో 28,000 మంది ఉద్యోగులు, రూ. 1,07.123 కోట్ల అసెట్స్‌ ఉన్నాయి.

రిలయన్స్ ఇన్‌ఫ్రా సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో నికర లాభం 50% తగ్గి రూ.1,911 కోట్లకు పడిపోయింది. ఇది ఒక సంవత్సరం క్రితం రూ.4,082 కోట్లుగా ఉంది. ఆదాయం కూడా రూ.7,346 కోట్ల నుంచి రూ.6,309 కోట్లకు తగ్గింది. వృద్ధి కార్యక్రమాల కోసం 600 మిలియన్ డాలర్ల సమీకరణ ప్రణాళికలను కంపెనీ ఇటీవల ప్రకటించింది.

రిలయన్స్ పవర్ రెండో త్రైమాసికంలో గణనీయంగా పుంజుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.352 కోట్ల నష్టం నుండి రూ.87 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇబిటా 64శాతం పెరిగి రూ.618 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.634 కోట్ల రుణాన్ని తీర్చేసింది. దాని డెట్-టు-ఈక్విటీ నిష్పత్తిని 0.87 కు తగ్గించుకుంది.

రిలయన్స్‌ గ్రూప్‌పై నియంత్రణ సంస్థలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈడీ చర్యల తరువాత రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్ఐఓ) దర్యాప్తు చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ ఇటీవల రూ .7,500 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)