Breaking News

సహజంగా ఉండి సమర్థంగా పని చేసేలా కొత్త ఉత్పత్తులు

Published on Fri, 02/20/2026 - 15:11

ఆయుర్వేద విజ్ఞానానికి ఆధునిక సైన్స్‌ను జోడిస్తూ ‘రిలీఫ్ వెల్నెస్’ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. భారత వెల్నెస్ మార్కెట్లో మొదటి స్మాల్ మాలిక్యూల్ హెర్బల్ ఫార్మా బ్రాండ్‌గా ఇది రికార్డు సృష్టించినట్లు చెప్పింది. ఈ బ్రాండ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొని కంపెనీ ఉత్పత్తులను ఆవిష్కరించారు.

సుమారు 5,000 ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానానికి, ప్రస్తుత ఫార్మాస్యూటికల్ టెక్నాలజీకి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా రీలీఫ్ వెల్నెస్ పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ‘కంపెనీ ఉత్పత్తుల్లో నానో సాంకేతికతను ఉపయోగించడం వల్ల సాధారణ హెర్బల్ ఉత్పత్తుల కంటే 20-30 రెట్లు వేగంగా శరీరంలోకి ఇంకుతాయి. కణాల స్థాయిలో పనిచేసే చిన్న అణువులతో కూడిన ఫార్ములేషన్లను భారత్‌లో తొలిసారిగా తీసుకొచ్చాం. ఇది అల్లోపతి మందుల తరహాలోనే వేగవంతమైన ఫలితాలను అందిస్తుంది’ అని కంపెనీ చెప్పింది.

పరిశోధనలే పునాదిగా..

రిలీఫ్ వెల్నెస్ వ్యవస్థాపకుడు మిస్టర్ డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ పరిశోధనలతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఆయుర్వేద మూలికల శక్తిని ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వేగంతో అందించడమే మా లక్ష్యం’ అని చెప్పారు. బ్రాండ్ సీఈఓ తరుణ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ‘కెమికల్స్‌తో కూడిన మందులకు ప్రత్యామ్నాయంగా, సహజంగా ఉండి సమర్థంగా పనిచేసే మందులు కావాలనేవారికి రిలీఫ్ వెల్నెస్ బెటర్‌ చాయిస్‌’ అన్నారు.

ఈ సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేశ ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్‌తో అనుసంధానం చేసిన విధానం ఆకట్టుకుంది. వెల్నెస్ రంగంలో పరిశోధనల ఆధారిత ఉత్పత్తులు రావడం అభినందనీయం’ అన్నారు. ఈ సంస్థ భారత్‌లోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ హబ్ సీ-క్యాంప్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది.

ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్‌! తులం ఎంతంటే..

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)