Breaking News

Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం

Published on Tue, 05/07/2024 - 13:59

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు చెందిన టైటన్ కంపెనీ షేర్లు  సోమవారం భారీగా క్షీణించడంతో రూ.800 కోట్లకు పైగా సంపద నష్టపోయారు.

టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటన్ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ​కుటుంబానికి భారీగా సంపద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందుకోకపోవడంతో మదుపరులు సోమవారం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రేఖా మార్చి 31, 2024 నాటికి టైటన్‌లో 5.35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం ముగింపు నాటికి ఆమె వద్ద ఉన్న షేర్ల విలువ రూ.16,792 కోట్లుగా ఉంది.

త్రైమాసిక ఆదాయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సోమవారం షేరు ధర 7 శాతం పడిపోయింది. షేర్‌ రూ.3,352.25 కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్‌ఈలో రూ.3,281.65 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ నికర విలువ రూ.3 లక్షల కోట్ల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2,91,340.35 కోట్లకు చేరింది. సోమవారం ఒక్కరోజే కంపెనీ విలువలో దాదాపు రూ.22,000 కోట్లకు పైగా సంపద తుడిచి పెట్టుకుపోయింది.

ఇదీ చదవండి: గూగుల్‌, ఓపెన్‌ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్‌ తయారీ

టైటన్‌ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.771 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.736 కోట్ల కంటే ఇది 5% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.9419 కోట్ల నుంచి రూ.11,472 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం రూ.3496 కోట్లకు పెరిగింది. 2022-23లో ఈ మొత్తం రూ.3274 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం కూడా రూ.38,675 కోట్ల నుంచి రూ.47,501 కోట్లకు పెరిగింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)