Breaking News

రిజిస్ట్రేషన్‌ బిల్లు-2025 ముసాయిదా విడుదల

Published on Tue, 06/03/2025 - 15:58

దేశవ్యాప్తంగా ప్రాపర్టీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. ఈ ప్రతిపాదిత చట్టం సమకాలీన డిమాండ్లకు సరిపోని నాటి 1908 రిజిస్ట్రేషన్ చట్టాన్ని భర్తీ చేయడానికి ఏర్పాటు చేశారు. కొత్త బిల్లు ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌ వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. తద్వారా బ్యూరోక్రసీ, మధ్యవర్తుల అవసరం తగ్గనుంది.

ప్రాపర్టీ డాక్యుమెంటేషన్‌పై ఆధారపడిన ఆర్థిక లావాదేవీలు, చట్టపరమైన నిర్ణయాలు, పరిపాలనా సేవలను క్రమబద్ధీకరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. భూ దందాల్లోనే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాల్లో కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ మార్పులు ప్రాధాన్యత చోటుచేసుకుంటున్నాయి.

1908 రిజిస్ట్రేషన్ చట్టం ఆన్‌లైన్‌ డాక్యుమెంట్ నిర్వహణ, డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వంటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడలేదు. ఈ వెసులుబాట్లు ‍టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో అత్యవసరంగా మారాయి. ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇప్పుడు కేవలం భూ దందాలకు మాత్రమే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాలకు కీలకంగా మారుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆన్‌లైన్‌ అప్‌లోడ​్‌లు, ఆధార్ ఆధారిత ధ్రువీకరణను అమలు చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా దేశం అంతటా స్థిరమైన, విశ్వసనీయమైన వ్యవస్థను స్థాపించడానికి కొత్త చట్టం అవసరమని భావిస్తున్నారు. ఈ ఏకరూపత పౌరులందరికీ సమర్థవంతమైన, సురక్షితమైన ఆస్తి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలకు అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపు

ప్రతిపాదిత అంశాలు..

  • గృహ కొనుగోలుదారులకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా నిర్వహించడం కొత్త బిల్లులోని ప్రధానాంశాల్లో ఒకటి. ప్రతిపాదిత విధానంలో పౌరులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పదేపదే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆస్తి పత్రాలను డిజిటల్‌గా నమోదు చేసుకోవచ్చు.

  • ఆన్‌లైన్ ద్వారా పేపర్ వర్క్ తగ్గుతుందని, ప్రక్రియలను వేగవంతం చేస్తుందని, మధ్యవర్తులపై ఆధారపడటాన్ని పరిమితం చేస్తుందని భావిస్తున్నారు.

  • ఆస్తుల లావాదేవీలకు డిజిటల్ రికార్డులను తప్పనిసరి చేయడం ద్వారా చట్టపరమైన రక్షణ పెరుగుతుంది. ఈ చర్యతో అమ్మకం ఒప్పందాలు, తనఖా పత్రాలు, సేల్ సర్టిఫికేట్లు వంటి కీలక డాక్యుమెంట్ల చట్టబద్ధత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

  • డిజిటల్-ఫస్ట్ విధానాన్ని అవలంబించడం ద్వారా, ఆస్తి లావాదేవీలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా చేయడమే ఈ బిల్లు లక్ష్యం. 

Videos

కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్

YS జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్..

ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు

సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే

వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ

హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు

బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!

జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది

ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు

Photos

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)

+5

జగన్‌ మావయ్యతో క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)

+5

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌.. అరుదైన (రేర్‌) ఫొటోలు

+5

ఏపీవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ ముందస్తు బర్త్‌ డే వేడుకలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)

+5

శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)

+5

రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)