Breaking News

ఏసీ ఆన్‌ చేయమంటే క్యాబ్‌ డ్రైవర్‌ ఏం చేశాడో తెలుసా..?

Published on Wed, 07/17/2024 - 13:19

ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసి ఎక్కాక ఏసీ ఆన్‌ చేయమన్న పాపానికి ఓ వినియోగదారుడికి డ్రైవర్‌ నుంచి వింత అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలను రెడ్డిట్‌లో పోస్ట్‌ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ తాను ఏం పోస్ట్‌ చేశాడు.. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

రెడ్డిట్‌లోని ‘నెర్డి-ఒజెడ్‌-బెంగళూరు’ అనే ఐడీలో వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం..‘ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేశాను. కారులో ఎక్కిన కాసేపటికి ఏసీ ఆన్ చేయమని డ్రైవర్‌ను అభ్యర్థించాను. అతడు కన్నడలో ‘ఎందుకు ఏసీ, మీరు రైడ్‌ను రద్దు చేసుకోండి​’ అన్నాడు. మరింత మర్యాదగా..దయచేసి పక్కన ఆపండి. నాకు మీ కారులో రావడం ఇష్టం లేదు అన్నాను. దాంతో డ్రైవర్ కోపంగా వెంటనే ఏసీ ఆన్ చేశాడు. కానీ పిచ్చివాడిలా కారు నడపడం ప్రారంభించాడు. సడన్ బ్రేక్‌లు వేయడం, సడన్ యాక్సిలరేషన్‌తో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. నాకు ‘వెర్టిగో’ సమస్య ఉంది. ఇలాంటి సడన్ జర్క్‌లకు మైకం కమ్ముతుందని చెప్పాను. కానీ నా మాటలు పట్టించుకోకుండా డ్రైవర్‌ అలాగే వ్యవహరించాడు. దాంతో వెంటనే ఉబర్ సేఫ్టీకి కాల్ చేశాను. కాల్‌ సెంటర్‌ వ్యక్తి నన్ను సురక్షితమైన ప్రదేశంలో దిగమని సలహా ఇచ్చాడు. కానీ డ్రైవర్‌ ఎక్కడా ఆపలేదు. తనపై నేను ఫిర్యాదు చేశానని డ్రైవర్‌కు అర్థమైంది. అతను నా పేరు, చిరునామా వివరాలను కాగితంపై రాసి, పికప్ లొకేషన్ తనకు తెలుసని తర్వాత తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు’ అని తెలిపారు.

ఈ పోస్ట్‌ వైరల్‌గా మారడంతో ఇంటర్నెట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేను కూడా ఇలాంటి ఒక డ్రైవర్‌ చేతిలో మోసపోయాను. ప్రజలను వేధించడానికి వారికి సాకు కావాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘డ్రైవర్‌ మిమ్మల్ని బెదిరించాడని ఉబెర్‌కు ట్వీట్ చేయండి. ఈ వ్యవహారంపై ధ్రువీకరణ కోరుతూ వారికి ఈమెయిల్ పెట్టండి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుస్తుంది. డ్రైవర్‌కు మీ వివరాలు తెలుసని రాశారు కదా.. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి’ అంటూ మరో యూజర్‌ రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: ఫిన్‌టెక్‌ కంపెనీలకు ఆర్‌బీఐ ఆదేశాలు

ఇదిలాఉండగా, ఏ కంపెనీ అయినా తన కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తే దాన్ని ఎవరైనా ఆదరిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉబర్‌ వంటి ఆన్‌లైన్‌ క్యాబ్‌ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు గ్రౌండ్‌ లెవల్‌లో వినియోగదారులకు నేరుగా సేవలందిస్తున్నవారికి కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేసి వాటిని పాటించేలా చూడాలని సూచిస్తున్నారు. దాంతో కంపెనీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు.

#

Tags : 1

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)