Breaking News

రష్యాపై యూఎస్‌ ఆంక్షలు.. చమురుపై ప్రభావం

Published on Thu, 01/16/2025 - 08:45

అమెరికా కొత్తగా ఆంక్షలు విధించినప్పటికీ మరో రెండు నెలల పాటు రష్యా నుంచి చమురు(Crude Oil) సరఫరాకి సమస్యేమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 12 వరకు అమలయ్యే కాంట్రాక్టులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలిపాయి. ఆ తర్వాత నుండి వర్తించే కాంట్రాక్టులపైన కూడా ప్రభావం పడకుండా రష్యా ఈలోగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందని వివరించాయి. భారత్‌ తదితర దేశాలకు చమురును చేరవేస్తున్న రెండు రష్యా సంస్థలపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆంక్షలు ఎదుర్కొంటున్న రెండు సంస్థల్లో ఒకటి మాత్రమే కాస్త చెప్పుకోతగ్గ స్థాయిలో సరఫరా చేస్తుండగా రెండో దాన్నుంచి నామమాత్రంగానే ఉంటోందని సీనియర్‌ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. భారత్‌కు సరఫరా చేసే ఇతర రష్యన్‌ సంస్థలు, ట్రేడర్లపై ఆంక్షలు లేవని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశాన్ని ఆర్థికంగా కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు చమురు సరఫరాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో భారత్‌ తదితర దేశాలకు రష్యా చమురు సరఫరా చేస్తోంది.

ఇదీ చదవండి: డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం అప్‌

గాజ్ ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్నెఫ్టెగాస్తో సహా రష్యా చమురు ఉత్పత్తిదారులపై, రష్యన్ చమురును రవాణా చేసే సుమారు 180 ట్యాంకర్లపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భవిష్యత్తులో రష్యా ముడిచమురు దిగుమతుల్లో 15 శాతం భారత్‌పై ప్రభావం పడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా క్రూడ్ సరఫరాకు తక్షణ ముప్పు లేనప్పటికీ, ఆంక్షలు సరుకు రవాణా ఖర్చులను పెంచుతాయని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే చమురును మరింత ఖరీదవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రిఫైనరీలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూఎస్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)