Breaking News

పెరిగిన కరెంట్‌ అకౌంట్‌ లోటు.. కారణాలు..

Published on Fri, 10/04/2024 - 15:00

దేశానికి వచ్చి-పోయే విదేశీమారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించే కరెంట్‌ అకౌంట్‌ లోటు(సీఏడీ) పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 9.7 బిలియన్‌ డాలర్ల(రూ.81 వేలకోట్లు) కరెంట్‌ అకౌంట్‌ లోటు నమోదైంది. అదే త్రైమాసికానికి చెందిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ 1.1 శాతంగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో (2023 ఏప్రిల్‌–జూన్‌) దీని విలువ 8.9 బిలియన్‌ డాలర్లు(రూ.74 వేలకోట్లు)గా నమోదైంది. అయితే 2024 జనవరి–మార్చి మధ్య కరెంట్‌ అకౌంట్‌ 4.6 బిలియన్‌ డాలర్ల(రూ.38 వేలకోట్లు) మిగులును నమోదుచేసుకుంది. ఈమేరకు ఆర్‌బీఐ ఇటీవల నివేదిక విడుదల చేసింది.

సీఏడీ పెరుగుదలకు కారణాలు..

  • క్యూ1లో కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరగడానికి వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం) కారణమని ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి. 2023 క్యూ1లో వస్తు వాణిజ్యలోటు 56.7 బిలియన్‌ డాలర్లు(రూ.4.7 లక్షల కోట్లు)కాగా, 2024 ఇదే కాలంలో ఈ విలువ 65.1 బిలియన్‌ డాలర్ల(రూ.5.4 లక్షల కోట్లు)కు ఎగసింది.

  • ఎన్నికల అనిశ్చితి నేపథ్యంలో నికర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు (ఎఫ్‌పీఐ) 2024–25 ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో కేవలం 0.9 బిలియన్‌ డాలర్లు(రూ.7.5 వేలకోట్లు)గా నమోదయ్యాయి.

  • ఏప్రిల్‌– జూన్‌ మధ్య విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) 5.6 బిలియన్‌ డాలర్ల(రూ.47 వేలకోట్లు) నుంచి 1.8 బిలియన్‌ డాలర్ల(రూ.15 వేలకోట్లు)కు పడిపోయాయి.

ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..

  • రెమిటెన్సులు (ఎన్‌ఆర్‌ఐలు దేశానికి పంపిన మొత్తం) మాత్రం 27.1 బిలియన్‌ డాలర్ల(రూ.2.2 లక్షల కోట్లు) నుంచి 29.5 బిలియన్‌ డాలర్ల(రూ.2.4 లక్షల కోట్లు)కు పెరిగాయి.  

  • నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం 4.7 బిలియన్‌ డాలర్ల(రూ.39 వేలకోట్లు) నుంచి 6.3 బిలియన్‌ డాలర్ల(రూ.52 వేలకోట్లు)కు ఎగిసాయి.

  • ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు 2.2 బిలియన్‌ డాలర్ల(రూ.18 వేలకోట్లు) నుంచి 4 బిలియన్‌ డాలర్ల(రూ.33 వేలకోట్లు)కు చేరాయి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)