Breaking News

చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్‌బై, ప్రత్యర్థికి సై!?

Published on Thu, 06/15/2023 - 11:13

చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్ రియల్‌మీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్  తన పదవికి  రాజీనామా వేశారు. సంస్థకు  ఐదేళ్ల పాటువిజయంతంగా సేవలందించి,  ఇండియన్‌  స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో  రియల్‌మీ ప్రముఖ బ్రాండ్‌గా  నిలబెట్టిన మాధవ్‌ సేత్‌ ఉన్నట్టుండి  గుడ్‌ బై  చెప్పడం కార్పొరేట్‌ వర్గాల్లో  చర్చకు దారి తీసింది.ఆయన నిష్క్రమణ కంపెనీకి గణనీయమైన ఎదురుదెబ్బ  అని మార్కెట్‌ వర్గాల అంచనా. (యూట్యూబర్లకు గుడ్‌ న్యూస్‌, 500 చాలట!)

ఈ సమాచారాన్ని మాధవ్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. సంస్థకు వీడ్కోలు పలకడం కష్టమే కానీ, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయం వచ్చిందంటూ ఒక నోట్‌ను మాధవ్‌  ట్వీట్‌ చేశారు.  రియల్‌మీకి తన జీవితంలో  చాలా ప్రాముఖ్యత ఉందని ఎన్నో అద్భుతమైన  మరపురాని క్షణాలను అందించిందని  పేర్కొన్నారు.

అంతేకాదు ఈ సందర్భంగా  తన పదవీ కాలంలో కొన్ని ముఖ్యమైన విజయాలను హైలైట్ చేశారు. రియల్‌మీ తన స్మార్ట్‌ఫోన్‌ను తొలిసారిగా యూనివర్సిటీలో విడుదల చేసి చరిత్ర సృష్టించింది. కంపెనీ 50 మిలియన్లకు పైగా ఉత్పత్తులను విక్రయించి, వేగంగా అమ్ముడవుతున్న బ్రాండ్‌గా మారింది. దేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్లేయర్‌గా కూడా నిలిచింది. నాణ్యత, కమిట్‌మెంట్‌కు తోడు  "మేక్ ఇన్ ఇండియా" చొరవ ఫలితంగా 5 జీ స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తికి దారితీసింది. గత ఐదేళ్లలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, టీమ్‌లు, పార్టనర్స్‌, ఇలా  ప్రతి ఒక్కరికీ షేత్ తన కృతజ్ఞతలు తెలిపారు.  (Adipurush Promotions: స్పెషల్‌ శాలువాతో కృతి సనన్‌, దీని విశేషాలు తెలిస్తే )

మాధవ్ సేత్‌ పయనం ఎటు?
రియల్‌మిని వీడిన తరువాత, మాధవ్ ప్రస్థానం ఎటు అనేదే ఇపుడు ప్రధాన ప్రశ్న. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ, ప్రధాన ప్రత్యర్థి హానర్‌లో చేరవచ్చని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాధవ్‌ అధికారిక ధృవీకరణ కోసం అందరూ  ఎదురు చూస్తున్నారు. హానర్ భారత మార్కెట్ నుండి వైదొలగనుందంటూ గతంలో వచ్చిన పుకార్లొచ్చాయి. అయాతే కంపెనీ ప్రతినిధి ఈ వాదనలను ఖండించిన సంగతి తెలిసిందే. <

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)