Breaking News

భారత్‌లో భారీ వృద్ధి లక్ష్యం

Published on Sat, 12/28/2024 - 09:46

చైనాకు చెందిన స్మార్ట్‌ పరికరాల తయారీ సంస్థ రియల్‌మీ(Realme) వినూత్న ఉత్పత్తుల డిజైన్, విస్తృత శ్రేణి, రిటైల్‌ విస్తరణతో 2025లో భారతీయ స్మార్ట్‌ఫోన్‌ రంగంలో 18 శాతం వాటా(market share)ను అందుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం ఉత్పత్తుల మెరుగైన పనితీరు, అత్యుత్తమ డిజైన్, మధ్య నుంచి అధిక–శ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని వెల్లడించింది.

కంపెనీకి భారత్‌ అతిపెద్ద విపణిగా ఉంది. 2024లో దేశీయ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో రియల్‌మీ 12 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. వచ్చే ఏడాది మార్కెట్‌ వాటాలో 50 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని రియల్‌మీ వైస్‌ ప్రెసిడెంట్, సీఎంవో చేస్‌ షూ వెల్లడించారు. 2025 ప్రారంభంలో విడుదల కానున్న రియల్‌మీ 14 ప్రో డిజైన్‌(Design)ను ఆవిష్కరించిన సందర్భంగా చేస్‌ మీడియాతో మాట్లాడారు.

ఇదీ చదవండి: మధ్య తరగతికి పన్ను మినహాయింపు..?

ఆఫ్‌లైన్‌ కోసం ప్రత్యేకంగా..

భారత్‌లో కంపెనీ తీవ్ర పోటీని ఎదుర్కొంది. కానీ చాలా మంచి ఫలితాలతో 2024 ముగించాం అని చేస్‌ వివరించారు. ‘ధర సున్నిత అంశమైన భారతీయ మార్కెట్‌లో అమ్మకాలను పెంచడానికి ప్రధాన ఈ–కామర్స్‌ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాం. 2025లో ఫ్లిప్‌కార్ట్‌లో నంబర్‌ వన్‌గా, అమెజాన్‌ వేదికగా మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. యువ కస్టమర్లను ఆకట్టుకునేలా మరిన్ని కలర్‌ ఆప్షన్స్‌తో భారత్‌ కోసం ప్రత్యేక డిజైన్స్‌ తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఆఫ్‌లైన్‌ నెట్‌వర్క్, సర్వీస్‌ సెంటర్లను విస్తరిస్తాం. మార్కెట్‌ వాటాను పెంచడానికి ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా మోడళ్లను తీసుకొస్తాం’ అని వివరించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)