సరికొత్త 'రియల్‌మీ జీటీ 7 ప్రో' వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

Published on Tue, 11/26/2024 - 15:45

చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారతీయ మార్కెట్లో 'జీటీ 7 ప్రో' లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా తయారైన ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ టెక్నాలజీని పొందుతుంది.

కొత్త రియల్‌మీ జీటీ 7 ప్రో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 12 జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.56,999), రెండు 16 జీబీ ర్యామ్.. 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ. 62,999). ఇవి రెండూ నవంబర్ 29నుంచి కంపెనీ వెబ్‌సైట్‌లో, అమెజాన్ ఈ-కామర్స్ సైట్‌లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం.

మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే అనే రెండు రంగులలో లభించే రియల్‌మీ జీటీ 7 ప్రో.. హై పర్ఫామెన్స్డ్ స్మార్ట్‌ఫోన్. ఇది 1.5కే రిజల్యూషన్‌తో 6.78 ఇంచెస్ కర్వ్డ్ డిస్‌ప్లే పొందుతుంది. స్క్రీన్ పెద్దగా ఉండటం మాత్రమే కాకుండా.. వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రత్యేకంగా గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని

జీటీ7 ప్రోలో.. సోనీ IMX882 సెన్సార్‌తో 50MP పెరిస్కోప్ పోర్ట్రెయిట్ కెమెరా, తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ కోసం మరో 50MP Sony IMX906 OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా &16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే కాకుండా వీడియో రీకరింగ్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తాయి. పోర్ట్రెయిట్, నైట్, అండర్ వాటర్ వంటి అనేక ఫోటోగ్రఫీ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.

ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..

రియల్‌మీ జీటీ 7 ప్రో 5800mAh బ్యాటరీ పొందుతుంది. ఇది 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఐపీ69 నీరు & ధూళి నిరోధకతను కూడా కలిగి ఉంది. కాబట్టి ఇది చాలా మన్నికైనది, ఏ వాతావరణనైకైనా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్ బరువు 222.8 గ్రాములు.. పొడవు 162.45 మిమీ పొడవు, వెడల్పు 76.89 మిమీగా ఉంది.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)