అక్టోబర్‌లో.. రియల్‌ బ్యాక్‌!

Published on Sat, 12/07/2024 - 12:16

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మళ్లీ పుంజుకుంది. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా నగర స్థిరాస్తి రంగంలో కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. అయితే, ఇటీవల ప్రభుత్వం కుదురుకోవటం, ఆర్థిక స్థిరత్వం చేకూరడం, అనుకూలమైన వడ్డీ రేట్లు ఉండటంతో కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగింది. 

దీంతో గృహ విక్రయాలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సెప్టెంబర్‌లో రూ.2,820 కోట్ల విలువైన 4,903 అపార్ట్‌మెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. అక్టోబర్‌ నాటికి రూ.3,617 కోట్ల విలువైన 5,894 యూనిట్లు అమ్ముడుపోయాయి. నెలరోజుల్లో ప్రాపర్టీ వ్యాల్యూలో 28 శాతం, విక్రయాల్లో 20 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది.

14 శాతం వాటా లగ్జరీదే..
గ్రేటర్‌లో గతేడాది జనవరి–అక్టోబర్‌ మధ్య కాలంలో రూ.30,464 కోట్ల విలువైన 58,390 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది అదే 10 నెలకాలంలో 65,280 అపార్ట్‌మెంట్లను విక్రయించారు. వీటి విలువ రూ.40,078 కోట్లు. గత నెలలో అమ్ముడైన వాటిల్లో రూ.కోటి విలువైన, 2 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న లగ్జరీ గృహాలదే 14 శాతం వాటా. గత నెలలో రూ.497 కోట్ల విలువైన 811 లగ్జరీ యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న 1,601 ప్రాపరీ్టలు, రూ.50 లక్షల లోపు ధర ఉన్న 3,482 యూనిట్లు అమ్ముడుపోయాయి.  

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)