Breaking News

ఇలా మోసం చేస్తున్నారు.. ఆర్‌బీఐ హెచ్చరిక!

Published on Sat, 08/31/2024 - 07:49

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్న అసాంఘిక శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆర్‌బీఐ హెచ్చరించింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఉద్యోగులుగా నటిస్తూ నకిలీ లెటర్‌ హెడ్స్, ఈమెయిల్‌ అడ్రెస్‌లను ఉపయోగించి లాటరీలు.. ఫండ్‌ ట్రాన్స్‌ఫర్, విదేశీ రెమిటెన్సులు, ప్రభుత్వ పథకాల పేరిట కొందరు మోసగిస్తున్నారని పేర్కొంది.

కరెన్సీ ప్రాసెసింగ్‌ ఫీజులు, ట్రాన్స్‌ఫర్‌/రెమిటెన్స్‌/ప్రొసీజర్‌ చార్జీలంటూ వసూలు చేస్తున్నారని వివరించింది. ఆర్‌బీఐ/ప్రభుత్వ అధికారుల్లాగా నటిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులు, స్కీములతో నిధులు పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్లు కట్టాల్సి ఉంటుందని చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను మోసగిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. సాధారణంగా వీరు ఐవీఆర్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్స్‌ ద్వారా బాధితులను సంప్రదిస్తున్నారు.

ఆర్‌బీఐ అధికారులుగా పరిచయం చేసుకునే సదరు మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసేస్తామని బెదిరిస్తూ, నిర్దిష్ట వ్యక్తిగత వివరాలు ఇచ్చేలా బాధితులను బలవంతపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అపరిచితులకు అకౌంట్‌ లాగిన్‌ వివరాలు, ఓటీపీ లేదా కేవైసీ పత్రాలు మొదలైనవి ఇవ్వరాదని రిజర్వ్‌ బ్యాంక్‌ సూచించింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)