ఎకానమీకి దేశీ డిమాండ్‌ దన్ను 

Published on Sun, 12/28/2025 - 04:32

ముంబై: సమన్వయంతో కూడిన ద్రవ్య, పరపతి– నియంత్రణ విధానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు బలంగా కొనసాగడానికి సాయపడినట్టు ఆర్‌బీఐ తాజా బులెటిన్‌ పేర్కొంది. అయితే వెలుపలి రిస్క్‌ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు పూర్తి రక్షణ లేకపోవడాన్ని గుర్తు చేసింది. 

స్థూల ఆర్థిక మూలాలు, ఆర్థిక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి కొనసాగించడం సామర్థ్యాలు, ఉత్పాదకత పెంపునకు సాయం చేస్తుందని.. వేగంగా మారిపోతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడేందుకు దారితీస్తుందని పేర్కొంది. 2025లో అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో టారిఫ్‌లతో నెలకొన్న అసాధారణ మార్పును ప్రస్తావించింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంపై ఈ ప్రభావం ఎంతమేర ఉంటుందన్న దానిపై స్పష్టత లేదంటూ.. అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపై మాత్రం ప్రభావం ఉంటుందని పేర్కొంది.  

పటిష్టంగా దేశీ డిమాండ్‌ 
దేశీయంగా బలమైన డిమాండ్‌ మద్దతుతో 2025–26లో క్యూ2లో (సెపె్టంబర్‌ త్రైమాసికం) భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని నమోదు చేసినట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది. నవంబర్‌ నెలకు సంబంధించి కీలక సంకేతాలు సైతం డిమాండ్‌ బలంగా ఉండడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ కనిష్ట స్థాయిలోనే కొనసాగుతుండడాన్ని గుర్తు చేసింది. 

2025 ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) గతేడాది ఇదే కాలంతో పోలి్చతే అధికంగా ఉన్నట్టు తెలిపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మాత్రం ప్రతికూలంగా ఉన్నట్టు  తెలిపింది. భారత్‌–యూఎస్‌ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశి్చతులు, అధిక వ్యాల్యూషన్ల వద్ద ఎఫ్‌పీఐల అమ్మకాలు చేస్తున్నట్టు పేర్కొంది. ఇది రూపాయి విలువను సైతం ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ అక్టోబర్‌లో 11.87 బిలియన్‌ డాలర్లు వెచి్చంచినట్టు వెల్లడించింది.

Videos

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

Photos

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)