Breaking News

మొదలైన ఆర్‌బీఐ ఎంపీసీ 

Published on Thu, 12/04/2025 - 06:24

ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చన్న అంచనాల మధ్య కొనసాగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం కనిష్టాలకు చేరి, జీడీపీ వృద్ధి బలపడడం, రూపా యి మారకం విలువ ఆల్‌టైమ్‌ కనిష్టాలకు పతనమైన సమయంలో జరుగుతున్న ఎంపీసీ భేటీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. కొందరు విశ్లేషకులు పావు శాతం రేటు కోతను అంచనా వేస్తుంటే, యథాతథ స్థితినే కొనసాగించొచ్చని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఆర్‌బీఐ ఎంపీసీ తన నిర్ణయాలను శుక్రవారం (5న) ఉదయం వెల్లడించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్‌బీఐ రెపో రేటును 1% తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే. ‘‘డిసెంబర్‌లో రెపో రేటు 0.25% తగ్గింపు ఉంటుందని అంచనా వేస్తున్నాం. వృద్ధి బలంగా ఉంది. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యో ల్బణం గణనీయంగా తగ్గింది. దీంతో రేట్ల కోతకు అదనపు వెసులుబాటు లభించింది’’అని క్రిసిల్‌ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకృతి జోషి తెలిపారు. వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సైతం గత నెలలో సంకేతం ఇచ్చారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)