మొదలైన ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్ష 

Published on Thu, 02/06/2025 - 06:06

ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. కొత్త ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ వడ్డీ రేట్లు, పరపతి విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ కీలకంగా చూసేది ద్రవ్యోల్బణాన్నే. వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్‌ ద్రవ్యోల్బణం) డిసెంబర్‌ త్రైమాసికానికి 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 4.8 శాతంగా ఉంటుందన్నది ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా. జనవరి నెల ద్రవ్యోల్బణం 4.5 సమీపంలో ఉండొచ్చని పేర్కొంది.

 ‘‘ద్రవ్యపరమైన ఉద్దీపనలు, వాణిజ్య యుద్ధాల పరంగా అనిశి్చతుల మధ్య ఆర్‌బీఐ రిస్‌్కలను సమతుల్యం చేయాల్సిన సున్నితమైన టాస్క్‌ను ఎదుర్కొంటున్నది. కనీసం స్వల్పకాలానికి రేట్ల తగ్గింపు పరంగా ఆర్‌బీఐకి వెసులుబాటు ఉంది’’అని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. ఫిబ్రవరి, ఏప్రిల్‌ సమీక్షల్లో పావు శాతం చొప్పున రేట్ల కోతలకు వెళ్లొచ్చని.. విరామం అనంతరం తిరిగి అక్టోబర్‌లో మళ్లీ రేట్ల కోత ఆరంభించొచ్చని తెలిపింది. మొత్తం మీద 0.75 శాతం మేర రేట్ల తగ్గింపు అవకాశాలను అంచనా వేస్తోంది.  

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)