Breaking News

కొటక్‌ బ్యాంక్‌పై కొరడా.. ఆర్బీఐ భారీ జరిమానా

Published on Sun, 12/21/2025 - 09:42

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్‌ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నిబంధనలు పాటించనందుకు గానూ రూ.61.95 లక్షలు జరిమానా చెల్లించాలని కొటక్‌ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

జరిమానా ఇందుకే.. 
‘బ్యాంకింగ్ సేవలు అందించడం - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా’ 'బిజినెస్ కరస్పాండెంట్లు (బీసీ) చేపట్టాల్సిన కార్యకలాపాల పరిధి'పై ఆదేశాలను పాటించనందుకు అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రూల్స్, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.

2024 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితికి సంబంధించి బ్యాంక్ సూపర్వైజరీ మూల్యాంకనాన్ని (ISE 2024) తనిఖీ చేసిన ఆర్బీఐ.. ఇప్పటికే కనీస సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్లకు అలాంటి  మరో ఖాతాను తెరిచినట్లు గుర్తించింది. అలాగే అనుమతించిన పరిధికి మించిన కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు అవకాశం కల్పించినట్లు కూడా గమనించింది. అంతేకాకుండా కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సిఐసి) తప్పుడు సమాచారాన్ని అందించినట్లు తేల్చింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి